అంబర్‌పేటలో నాలుగేల్ల చిన్నారి ప్రదీప్.. వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే టీఆర్‌ఎస్ నాయకులు స్పందిస్తూ.. బాలుడి కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. మరి ఆ పరిహారం ఇచ్చారా లేదా అంటే..
అంబర్‌పేటలో నాలుగేళ్ల పిల్లాడు వీధి కుక్కల దాడిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఏటా వీధి కుక్కల బారిన పడి ఎందరో ఆస్పత్రి పాలవుతున్నారు. మరీ ముఖ్యంగా చిన్నారులు, మహిళలు, వృద్ధులు.. వీధి కుక్కల వల్ల అధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక అంబర్‌పేట ఘటనలో నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్‌పై ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు కుక్కలు దాడి చేశాయి. కుక్కల బారి నుంచి తప్పించుకోవడానికి బాలుడు భయంతో పరుగులు తీశాడు. కానీ విచక్షణ లేని ఆ జీవులు చిన్నారి కాళ్లు పట్టుకుని లాక్కెళ్లాయి. బాలుడిపై పాశవికంగా దాడి చేశాయి. ఈ దాడిలో బాలుడి శరీరంపై సుమారు 32 చోట్ల గాయాలయ్యాయి. ఈ క్రమంలో బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే చిన్నారి ప్రదీప్ మృతి చెందాడని ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ దారుణ సంఘటనపై మంత్రి కేటీఆర్, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, మరి కొందరు టీఆర్‌ఎస్ నాయకులు స్పందించారు. కుక్కల దాడిలో చిన్నారి ప్రదీప్ మృతి చెందడం కలచి వేసిందని.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలిపారు. వీధి కుక్కల సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. అంతేకాక బాధిత బాలుడి కుటుంబాన్ని ఆదుకుంటామని టీఆర్‌ఎస్ నాయకులు హామీ ఇచ్చారు. కానీ సంఘటన జరిగి ఐదు రోజులు అవుతున్న.. ఈ హమీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు.
బాధిత బాలుడి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి నష్టపరిహారం అందలేదు. మరో విషాదకర అంశం ఏంటంటే.. చిన్నారికి అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా బాధిత కుటుంబం దగ్గర డబ్బులు లేవు. దాంతో ప్రదీప్ తండ్రి పని చేస్తున్న కార్ సర్వీసింగ్ సెంటర్ యజమానే కొంత ఆర్థిక సాయం చేశాడని.. ఆ డబ్బులతోనే చిన్నారికి అంత్యక్రియలు నిర్వహించారని తెలుస్తోంది. దాంతో జనాలు.. చిన్నారిని కోల్పోయి తీవ్ర దుఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారు.. ఇలాంటి కష్టకాలంలో కూడా ఆదుకోకపోతే ఎలా.. ప్రభుత్వం నుంచి సాయం అందడంలో ఇంత ఆలస్యం ఎందుకు.. దీనిపై టీఆర్‌ఎస్ నాయకులు, జీహెచ్‌ఎంసీ మేయర్ ఎందుకు స్పందించడం లేదు అని జనాలు ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.