పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. జీవితంలో ఒక్కసారే వచ్చే ఈ ముఖ్యమైన ఘట్టానికి వధూవరులు వినూత్నంగా చేసుకోవాలని ఊవిళ్లురుతున్నారు. దాని కోసం విభిన్న ఆలోచనలు చేస్తున్నారు. కానీ మనం చెపుకునే వ్యాపారి మాత్రం.. తన తమ్ముడికి కోసం ఏం చేశాడంటే..?
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారి జరుపుకునే అద్భుతమైన ఘట్టం. అందుకే పెళ్లి పనులు మొదలయ్యే నాటి నుండి అన్ని ఓ ప్రణాళిక ప్రకారం సిద్ధం చేసుకుంటారు వధూవరూలు, వారి కుటుంబాలు. పసుపు కొట్టే నాటి నుండి అప్పగింతల వరకు ప్రతిదీ మధురానుభూతిగా మిగిల్చుకునేందుకు పరితపిస్తుంటారు. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోలేక పోయినా తాము అనుకున్న విధంగా పెళ్లి చేసుకోవాలని భావిస్తుంటారు. పెళ్లి పత్రికల దగ్గర నుండి కొబ్బరికాయ మీద వేసే డిజైన్ వరకు వినూత్నంగా ఉండాలని ఆలోచిస్తున్నారు నేటి యువత. అయితే గతంలో దూర భారాలు వెళ్లి పెళ్లి పత్రికను ఇచ్చేవాళ్లు. ఆ తర్వాత కొరియర్. ఇప్పుడు పెళ్లి పత్రికను దగ్గర ఉన్న బంధువులకు కూడా వాట్సప్ వంటి సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తున్నారు. కానీ హెదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి వినూత్నంగా ఆలోచించాడు.
తన తమ్ముడి పెళ్లిని ధూమ్ ధామ్‌గా నిర్వహించాలనుకున్నాడు ఖైరతాబాద్‌కు చెందిన మధు యాదవ్ అనే వ్యాపారి. అతడు దూద్ వాలా పేరుతో ఓ డైరీ ఫాం నిర్వహిస్తున్నాడు. ఈ నెల 9న అతడి తమ్ముడు చందు యాదవ్ వివాహం నిశ్చయమైంది. ఇక పెళ్లి పిలుపులే తరువాయి. నగరంలోని బంధువులు, స్నేహితులకు పెళ్లిపత్రికలు పంపిణీ చేశాడు. స్వయంగా ఆయన తమ్ముడి వివాహానికి రావాలని ఆహ్వానిస్తున్నారు. అయితే ముంబయిలో ఉన్న స్నేహితులు, బంధువులకు కూడా పెళ్లి పత్రికలు స్వయంగా అందించాలనుకున్నాడు. దీని కోసం వినూత్న ఆలోచనకు తెరలేపాడు.పెళ్లి పత్రికలు అందించేందుకు ఏకంగా హెలికాఫ్టర్‌నే బుక్ చేశాడు మధు యాదవ్.
ఈ హెలికాఫ్టర్‌లోనే వెళ్లి బంధువులు, స్నేహితులకు అందించాడు. మంగళవారం హెలికాప్టర్‌లో ముంబయికి వెళ్లి బంధువులకు తమ్ముడి లగ్న పత్రికలు అందజేశాడు. అసలు పిలుపులే కరువైన ఈ రోజుల్లో కేవలం పెళ్లి పత్రికలు ఇచ్చేందుకు మధు యాదవ్ హెలికాఫ్టర్ లో వెళ్లడం ఆశ్చర్యమనిపించక మానదు. ఈ చర్యతో తన తమ్ముడిపై అతడికున్న ప్రేమను చాటుకున్నారు. ఇక పెళ్లి పత్రికలే హెలికాప్టర్‌లో పంపిణీ చేస్తే.. పెళ్లికి ఏ రేంజ్‌లో ఏర్పాట్లు ఉంటాయోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. కొంత మంది వార్ని ఇద్దెక్కడి విడ్డూరమని అనుకుంటున్నారు. పత్రికల కోసమే హెలికాప్టర్ బుక్ చేసిన ఈ అన్నయ్య ప్రేమ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.