హైదరబాద్ నగరంలో.. మెహదీపట్నంలో గల మీనా మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో అరుదైన సంఘటన జరిగింది. 27 ఏళ్ల ఒక మహిళ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. సాధారణంగా కవలలు కనిపిస్తేనే మనం కొంచెం ఆసక్తిగా చూస్తాం. ఎప్పుడో ఓ సారి ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు పుట్టారు అనే వార్తలు వింటుంటాం. కానీ హైదరాబాద్లో ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు చిన్నారులకు జన్మనివ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
మెహిదీపట్నంలోని మీనా ఆసుపత్రిలో ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చారు. బుధవారం ఆసుపత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డా.సోహెబా షుకూర్ వైద్య బృందం వివరాలు వెల్లడించింది. ప్రసవంలో ముగ్గురు ఆడ, ఒక మగ శిశువు పుట్టినట్లు వైద్య బృందం తెలిపారు. ప్రస్తుతం తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వెల్లడించారు.
మగ శిశువు 1500 గ్రాములు, ఆడ శిశువులు 1500, 1400, 1300 గ్రాముల బరువు ఉన్నట్లు వివరించారు. పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు. ఇక మహిళకు ఇదే మొదటి కాన్పు కావడం తో కుటుంబ సభ్యులు కూడా చాలా ఆనందం తో ఉన్నారు. ఒకే కాన్పులో నలుగురు పిల్లలు పుట్టి ఆరోగ్యంగా ఉండటం తో తల్లి దండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. Rక ఆగస్టులో కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చి విషయం తెలిసిందే.
Telangana | A 27-year-old woman gives birth to quadruplets in Hyderabad
The women gave birth to a baby boy and three baby girls. All the babies and the mother are healthy: Dr. Soheba Shukoo, Obstetrician and gynaecologist, Mina Multispeciality Hospital pic.twitter.com/nI5xvGLV2l
— ANI (@ANI) October 27, 2021