స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1కు అప్‌గ్రేడ్‌గా వచ్చిన స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్‌తో స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. మునుపటి కంటే మెరుగైన సీపీయూ, జీపీయూ పర్ఫార్మెన్స్ ఉండడంతో.. అన్ని కంపెనీలు ఈ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్‌ను హైలైట్ చేస్తూ స్మార్ట్ ఫోన్స్ ను లాంచ్ చేసే పనిలో ఉన్నాయి. ఇప్పటికే.. వన్‌ప్లస్ నుంచి వన్‌ప్లస్ 10టీ, ఐకూ నుంచి ఐక్యూ 9టీ స్మార్ట్ఫోన్లు లాంచ్ అయ్యాయి. మరి.. ఈ రెండింటిలో ఏ మొబైల్ ప్రత్యేకత ఏంటి? ఒకదానితో మరొకటి పోల్చినపుడు ఎలాంటి తేడాలు ఉన్నాయి? ధరల్లో వ్యత్యాసం ఎలా ఉంది? అన్నవిషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ధర:
వన్‌ప్లస్ 10టీ మూడు వేరియంట్లలో భారత మార్కెట్ లో లాంచ్ అయ్యింది. బేస్ మోడల్ 8జీబీ+ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.49,999కాగా, 12జీబీ+ 256జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.54,999గా నిర్ణయించారు. ఇక.. హైఎండ్ మోడల్ 16జీబీ+ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.55,999గా ఉంది. జేడ్ గ్రీన్, మూన్ స్టోన్ బ్లాక్ కలర్లలో అందుబాటులో ఉన్నాయి.
ఇక.. ఐక్యూ 9టీ 5జీ రెండు వేరియంట్ లలో లాంచ్ అయింది. ఇందులో బేస్ మోడల్ 8జీబీ+ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.49,999కాగా, 12జీబీ+ 256జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.54,999గా ఉంది. ఇది ఆల్ఫా మరియు లెజెండ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
వన్‌ప్లస్ 10టీ 5జీ స్పెసిఫికేషన్స్:
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై వన్‌ప్లస్ 10టీ పని చేస్తుంది. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ప్లేను అందించారు. లో టెంపరేచర్ పాలీక్రిస్టలైన్ ఆక్సైడ్ (ఎల్టీపీవో) టెక్నాలజీపై ఈ డిస్ప్లేను రూపొందించారు. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, 10 బిట్ కలర్ డెప్త్, హెచ్డీఆర్10+ సర్టిఫికేషన్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ మొబైల్ IP53 వాటర్ లేదా డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్ ఫీచర్ తో వచ్చింది.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రైమరీ కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా.. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
బ్యాటరీ సామర్థ్యం 4800 ఎంఏహెచ్‌గా ఉంది. 150W సూపర్‌వూక్ వైర్డ్ చార్జింగ్ సపోర్ట్ చేయనుంది. ఈ ఫోన్ పూర్తిగా చార్జ్ అవ్వడానికి కేవలం 19 నిమిషాల సమయం మాత్రమే పట్టనుంది. 4జీ ఎల్టీఈ, 5జీ, వైఫై 6, బ్లూటూత్ వీ5.3, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్స్ కూడా అందించారు.
ఐక్యూ 9టీ 5జీ స్పెసిఫికేషన్స్:
ఐక్యూ 9టీ 5జీ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తుంది. 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే డిస్ప్లే దీన్ని లాంచ్ చేశారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1,080 x 2,400 పిక్సెల్స్‌గా ఉంది. హెచ్డీఆర్ సపోర్ట్, 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్లను కూడా ఈ ఫోన్లో అందించారు. వీ1ప్లస్ ఇమేజింగ్ చిప్ కూడా ఇందులో ఉండనుంది. ఇది కెమెరా పెర్ఫార్మెన్స్ను మెరుగుపరచనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 12 మెగాపిక్సెల్ ఐఎంఎక్స్663 సెన్సార్ కూడా ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.
4700 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. 120W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. డ్యూయల్ 5జీ సిమ్, వైఫై 6, బ్లూటూత్ వీ5.3, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ పోర్టు కూడా ఈ ఫోన్లో ఉన్నాయి.
ఏది బెస్ట్: రెండు ఫ్లాగ్షిప్ ఫోన్లలోనూ ప్రైస్, స్పెసిఫికేషన్స్ దాదాపు ఒకేలా ఉన్నాయి. ఏది ఎంచుకోవడం అనేది.. మీ నిర్ణయమే. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.