కీ ప్యాడ్, ఫీచర్ ఫోన్స్ లో నోకియా కంపెనీకి తిరుగు ఉండేది కాదు. కానీ, స్మార్ట్ యుగంలో ఈ కంపెనీ కాస్త ఎక్కువగానే వెనుకబడిందని చెప్పాలి. నోకియా కూడా స్మార్ట్ ఫోన్ తయారీలో ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటోంది. తాజాగా ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని భారత మార్కెట్ లోకి విడుదల చేసింది.
ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వాడుతున్న కొన్ని కోట్ల మంది మొదట కచ్చితంగా నోకియా కీప్యాడ్ ఫోన్ నే వాడుంటారు. ఫీచర్ ఫోన్స్ లో నోకియా కి కొన్నేళ్ల పాటు ఏ సంస్థ కూడా పోటీ ఇవ్వలేకపోయింది. అయితే ఎప్పుడైతే ఆండ్రాయిడ్, స్మార్ట్ ఫోన్లు రావడం మొదలైందో అప్పటి నుంచి నోకియా తమ మార్కెట్ ని కోల్పోయింది. ఆండ్రాయిడ్ పోటీ ప్రపంచంలో నిలదొక్కులేక పోయింది. ఆ తర్వాత స్మార్ట్ ఫోన్లు తయారీ ప్రారంభిచినా కూడా అంత ప్రభావం చూపలేకపోయింది. కానీ, ఇప్పుడు నోకియా కంపెనీ కూడా తమ పంథా మార్చేసింది. స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది. ఇప్పుడు ఏకంగా రూ.5,999కే స్మార్ట్ ఫోన్ లాంఛ్ చేసి వినియోగదారులను ఆకట్టుకుంటోంది.
నోకియా కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపు, ఆదరణ అందరికీ తెలిసిందే. కాకపోతే ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చిన తర్వాత నోకియా ఫోన్లకు డిమాండ్ తగ్గిపోయింది. ఆ తర్వాత ఇప్పుడిప్పుడే నోకియా కంపెనీ కూడా పుంజుకుని స్మార్ట్ ఫోన్ తయారీలో దూసుకుపోతోంది. బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్లను తయారు చేస్తూ వినియోగదారుల ఆదరణ పొందుతోంది. ఇప్పుడు తాజాగా నోకియా నుంచి ఒక బెస్ట్ బడ్జెట్ ఫోన్ ఒకటి విడుదలైంది. కేవలం రూ.5,999కే నోకియా సీ12 అనే స్మార్ట్ ఫోన్ ని భారత్ మార్కెట్ లో విడుదల చేశారు. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ఎన్నో బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ కి ఈ నోకియా సీ12 గట్టి పోటీ ఇస్తుంది అనడంలో సందేహం లేదు.
ఈ నోకియా సీ12 ఫోన్ లుక్స్ కూడా చాలా స్టైలిష్ గా ఉన్నాయి. ఇంక స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. 6.3 హెచ్ డీ+ ఎల్ సీడీ డిస్ ప్లే, 8ఎంపీ రేర్ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. నైట్ మోడ్- పోట్రెయిట్ మోడ్స్ కూడా ఉన్నాయి. 3000 ఎంఏహెచ్ రీమూవబుల్ బ్యాటరీతో వస్తోంది. దీనిలో 2 జీబీ ర్యామ్+ 2 జీబీ వర్చువల్ ర్యామ్ ఉంది. 64 జీబీ స్టోరేజ్ కూడా లభిస్తోంది. ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ మీద రన్ అవుతుంది. రెండేళ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ ని కూడా ప్రామిస్ చేస్తున్నారు. ఏడాదిపాటు రీప్లేస్మెంట్ గ్యారెంటీ కూడా లభిస్తోంది. నోకియా కంపెనీ నుంచి భవిష్యత్ లో మరికొన్ని బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు విడుదల కానున్నాయి చెబుతున్నారు.
Nokia C12 to launch in India soon
NOKIANEWS – News of the Nokia https://t.co/1DrTitnQ3D pic.twitter.com/Lk9pnI5fMo
— nokianews (@nokianews_hu) March 11, 2023