ఎంతో మంది కార్లు కొంటూ ఉంటారు. తమ వ్యక్తిగత, కుటుంబ, ఉపాధి కోసం ఇలా పలు అవసరాల కోసం కారుని కొనుగోలు చేస్తుంటారు. నిజానికి కారు కొనే వరకు ఉండే ఆసక్తి.. కొన్నాక ఉండదు. అందరూ కారు కొన్న తర్వాత దానిని పట్టించుకోవడం మానేస్తుంటారు. తర్వాత క్రమంగా కారు లైఫ్ తగ్గిపోతూ ఉంటుంది. అయితే కొన్ని టిప్స్ ఫాలో అయితే కారు తప్పకుండా మంచి కండిషన్ లోఉంటుంది.
చాలా మందికి కారు కొనడం ఒక కల. ఆ కలను నెరవేర్చుకోవడానికి ఎంతో కష్టపడతారు. చివరికి తమ డ్రీమ్ కారుని కొనుగోలు చేస్తారు. కానీ, ఆ తర్వాత కారుని అస్సలు పట్టించుకోరు. తమ లక్ష్యాన్ని రీచ్ అయ్యాం కదా అని ఇంక కారు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోరు. అలా తీసుకోకపోతే మీ కలల కారు త్వరగా గ్యారేజ్ కి వెళ్లే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా కొన్ని విషయాల్లో మీరు తప్పకుండా దృష్టి సారించాలి. అలాగే మీరు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ కారు లైఫ్ మాత్రమే కాదు.. మైలేజ్ కూడా పెరుగుతుంది. దాని వల్ల మీ పర్స్ కూడా పదిలంగా ఉంటుంది. వాటిల్లో ముఖ్యమైన, సింపుల్ చిట్కా ఒకటి ఉంది.
కారు కొనడంతో సరిపోదు.. దానిని మెయిన్ టైన్ చేయాలి. అందుకు కాస్త ఖర్చు కూడా అవుతుంది. అయితే చాలా మంది డబ్బు ఖర్చుఅవుతుందనే కారణంతో దానిని సర్వీస్ చేయించడం మానేస్తుంటారు. నిజానికి కారు పాతది అయ్యే కొద్ది మీరు ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. అలా చేస్తే ఇంకొన్నాళ్లు మీ కారు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. అలాంటి వాటిలో కారు ఎయిర్ ఫిల్టర్ మార్చడం ఒకటి. చాలా మంది కారు సర్వీసింగ్ చేస్తున్న సమయంలో కూడా ఎయిర్ ఫిల్టర్ మార్చడం మానేస్తారు. కనీసం దానిని క్లీన్ కూడా చేయించరు. అలా చేయడం చాలా తప్పు. దాని వల్ల మీకు ఎక్కువ నష్టం జరుగుతుంది.
కారు లైఫ్ విషయంలో ఎయిర్ ఫిల్టర్ అనేది చాలా కీలకపాత్ర పోషిస్తుంది. ఈ ఎయిర్ ఫిల్టర్ మట్టిగా ఉండటం, క్లీన్ గా లేకపోవడం వల్ల ఇంజిన్ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. అంతేకాకుండా ఎయిర్ ఫిల్టర్ ని తరచూ మార్చకపోవడం వల్ల మీ కారు మైలేజ్ కూడా బాగా తగ్గుతుంది. మీరు ఎయిర్ ఫిల్టర్ మార్చిన తర్వాత గమనించండి.. గతంతో పోలిస్తే కారు మైలేజ్ కచ్చితంగా పెరుగుతుంది. మంచి ఎయిర్ ఫిల్టర్ వల్ల.. కారు పికప్ కూడా 6 నుంచి 11 శాతం పెరుగుతుంది. ఇంజిన్ లైఫ్ కూడా కచ్చితంగా పెరుగుతుంది. 1900 నుంచి 2400 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత ఎయిర్ ఫిల్టర్ మార్చుకుంటే మంచిది. ఎక్కువ దుమ్ము ఉండే ప్రాంతాల్లో ప్రయాణిస్తే ఇంకా త్వరగా మార్చుకుంటే మంచిది.