ప్రస్తుతం కంటెంట్ క్రియేటర్లు ఎక్కువైపోయారు. వ్లాగ్స్, యూట్యూబ్ ఛానల్స్ అంటూ అంతా కంటెంట్ ని క్రియేట్ చేస్తున్నారు. వారు కొత్త కొత్త కెమెరాలు, గ్యాడ్జెట్స్ అంటూ ఎంతో మంచి క్వాలిటీతో కంటెంట్ ని అందిస్తున్నారు. ఇదివరకంటే సినిమాల్లో డ్రోన్లను వినియోగించేవారు. కానీ, ఇప్పుడు కంటెంట్ క్రియేటర్లు కూడా డ్రోన్లు, అదిరిపోయే సూపర్ కెమెరాలను వాడుతున్నారు. అలాంటి వారి కోసం ఇప్పుడు ఒక సూపర్ డ్రోన్ తీసుకొచ్చాం. ఇది ఫ్యూచరిస్టిక్ సూపర్ డ్రోన్. నిజానికి దీని ఫీచర్లు చూస్తే మీకు హాలీవుడ్ సినిమా షాట్స్, ఫ్రేములు గుర్తొస్తాయి. అసలు ఈ సూపర్ డ్రోన్ ఫీచర్లు ఏంటి? అది ఎందుకు అంత స్పెషల్? ఇప్పుడు చూద్దాం.
ఇప్పుడు చెప్పుకోబోయే డ్రోన్ పేరు DJI FPV. ఇది ఒక సూపర్ డ్రోన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే దీని ఫ్లైయింగ్ ఎక్స్ పీరియన్స్, దీని డ్రోన్ కంట్రోలర్స్ దీనిని సూపర్ డ్రోన్ గా మార్చింది. ఇప్పటి వరకు వచ్చిన డ్రోన్స్, సాధారణ ప్రజలు వాడే డ్రోన్స్ అన్నీ లిమిటెడ్ కంట్రోల్స్ తో వస్తాయి. పైగా సాధారణ డ్రోన్స్ ని కంట్రోల్ చేయడం అంత సులభం కాదు. ఈ డీజేఐ ఎఫ్‌పీవీ రేసింగ్ డ్రోన్ అని చెప్పొచ్చు. దీనిని ఆపరేట్ చేస్తుంటే మీకు అచ్చు ఫ్లైట్ నడిపిన ఫీలింగ్ వస్తుంది. ఇది గతేడాది జనవరి నుంచి అందుబాటులో ఉన్నా కూడా చాలా మందికి దీని గురించి తెలియలేదు. దీనిలో ఉండే ఫీచర్స్ దీనిని అన్నింటి నుంచి వేరుగా, ప్రత్యేకంగా చూపిస్తున్నాయి.
ఈ డ్రోన్ ని ఎవరైనా కంట్రోల్ చేయచ్చు. ఆటోమేటిక్ కారులో ఉన్న మాదిరిగా దీనిలో మోడ్స్ ఉంటాయి. వాటిలో N మోడ్.. ఇందులో సాధారణ డ్రోన్ లాగా దీనిని ఫ్లై చేయచ్చు. తర్వాత S మోడ్ ఉంటుంది. దీనిలో హైబ్రిడ్ ఫ్లైట్ ఎక్స్ పీరియన్స్ ని మీరు అనుభూతి చెందగలరు. దీనిలో M మోడ్ ఉంటుంది. దీనిని యాక్టివేట్ చేయడం ద్వారా అన్ లిమిటెడ్ ఫ్లైట్ కంట్రోల్, యూనిక్ ఫ్లైయింగ్ ఎక్స్ పీరియన్స్ పొందవచ్చు. ఈ M మోడ్ ద్వారా మీ స్కిల్స్, మీ ఇమాజినేషన్ ని బట్టి విజువల్స్ క్యాప్చర్ చేయచ్చు. ఈ డ్రోన్ ఎందుకు స్పెషల్ అంటే.. దీనిలో వీఆర్ తరహా స్పెషల్ గాగుల్స్ ఉంటాయి. వీటి ద్వారా మీరు రికార్డు చేస్తున్న విజువల్స్ ని వర్చువల్ ఫీల్ కావొచ్చు. అచ్చు మీరు విమానాన్ని నడుపుతున్న అనుభూతిని పొందుతారు.
ఈ డ్రోన్ కంట్రోల్ చేసేందుకు రెండు తరహా కంట్రోల్స్ ఉంటాయి. ఒకటి స్టాండర్డ్ రిమోట్ కంట్రోల్ దీని ద్వారా మీరు డ్రోన్ ని కంట్రోల్ చేయచ్చు. సాధారణంగా డ్రోన్స్ ని ఎగరవేయడమే కాదు.. తిరిగి తీసుకురావడం కూడా చాలా కష్టం. చాలామందికి తిరిగి డ్రోన్ ని లాండ్ చేయడం రాదు. అయితే దీనిలో ఇందుకోసం ప్రత్యేకమైన బటన్ ఉంటుంది. రిడర్న్ టూ హోమ్ అనే బటన్ ప్రెస్ చేస్తే.. డ్రోన్ దానంతట అదే తిరిగి టేకాఫ్ అయిన ప్లేస్ కి వచ్చి లాండ్ అవుతుంది. అంతేకాకుండా దీనిలో మోషన్ కంట్రోలర్ ఉంటుంది. అంటే దీనిద్వారా మీ చేతి కదలికలతో డ్రోన్ ఎగురుతుంది. మీ చేయి కుడివైపునకు తిప్పితే డ్రోన్ రైట్ సైడ్ వెళ్తుంది.
దీనిలో ఇంకో అద్భుతమైన ఫీచర్ ఏంటంటే.. బ్రేక్. అవును మీరు విన్నది నిజమే ఈ డ్రోన్ కంట్రోల్‌లో బ్రేక్ అనే బటన్ ఉంటుంది. ఒకవేల డ్రోన్ కంట్రోల్ తప్పుతుంది అనుకుంటే.. ఆ బటన్ నొక్కగానే డ్రోన్ ఆగిపోతుంది. ఉన్నచోట నిలబడి ఎగురుతూ ఉంటుంది. దీనిలో 4K కెమెరా ఉంటుంది. గరిష్టంగా 20 నిమిషాలు ఎగరవేయచ్చు. ఇంటిలిజెంట్ బ్యాటరీ సిస్టమ్ ఉంటుంది. 10 కిలోమీటర్ల రేంజ్ లో ట్రాన్స్‌మిషన్ జరుగుతుంది. డ్రోన్ నుంచి గాగుల్స్ కు కేవలం 28 మిల్లీ సెక్లలనో విజువల్ ట్రాన్సఫర్ అవుతుంది. దీని పార్ట్స్ కూడా తేలిగ్గా మార్చుకునేలా ఉంటాయి. దీని ధర రూ.80 వేల నుంచి రూ.లక్షన్నర వరకు ఉంది. మీరు ఎంచుకునే గ్యాడ్జెట్స్ ని బట్టి దీని ధర ఆధారపడి ఉంటుంది.
With this #VR goggle, you can get a super immersive drone-flying experience.#technology pic.twitter.com/KrhlGyRoSu
— Smart Roadshow News (@srsnews2022) February 2, 2023