Keyboard Remote: ఇప్పుడు అందరి ఇళ్లలో టీవీలు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు ఉండటం సర్వ సాధారణం అయిపోయింది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ కొత్త కొత్త మోడల్స్, ఫీచర్స్‌తో టీవీలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక టీవీకి ఓ రిమోట్, దాని బాక్స్‌కు ఓ రిమోట్ ఇలా ఒక్కోదానికి ఒక్కో రిమోట్ ఉండటం వల్ల మా చెడ్డ చిరాకు వచ్చేస్తుంది. దానికి తోడు ఆ రిమోట్లలో కొన్ని ఫీచర్స్ మాత్రమే ఉండటం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. అందుకే హైటెక్ కార్టు కంపెనీ ఓ సరికొత్త రిమోట్‌ను అందుబాటులోకి తెచ్చింది. కీబోర్డు మాదిరిగా ఉండే ఈ వైర్‌లెస్ కీబోర్డు రిమోర్టు అన్ని టీవీలకు పని చేస్తుంది. కేవలం టీవీలకు మాత్రమే కాదు.. కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లకు కూడా ఇది పనిచేస్తుంది. ఇందులో అనేక రకాల ఫీచర్స్ కూడా ఉన్నాయి. దీన్ని మూడు రకాలుగా టీవీలకు కనెక్ట్ చేసుకోవచ్చు.
ఈ కీబోర్డ్ రిమోట్‌ను బ్లూటూత్, యూఎస్‌బీ, ఇన్‌ఫ్రారెడ్ ఆప్చన్ల ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. సైజులో కూడా చిన్నగా ఉండే ఈ కీబోర్డు రిమోట్‌ను జేబులో కూడా పెట్టేసుకోవచ్చు. హైటెక్‌కార్ట్ వైర్‌లెస్ బ్లూటూత్ మల్టీఫంక్షన్ టచ్‌పాడ్ కీబోర్డు ఫీచర్స్ ఏంటంటే.. ఈ కీబోర్టు రిమోట్‌తో టైప్ చేయటం చాలా ఈజీ. మెయిల్స్, చాట్ వంటివి టీవీలోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇది హెచ్‌టీపీసీ, స్మార్ట టీవీ, ఆండ్రాయిడ్ సిస్టమ్స్‌తో నడిచే టీవీ బాక్సులకు పనిచేస్తుంది. అంతేకాదు! సోనీ స్టేషన్ 3కి ఇది పనిచేస్తుంది. సోఫాలోనే కూర్చుని దీన్ని వాడుకోవచ్చు. ఇన్ని ఫీచర్స్ ఉన్న దీని ధర కేవలం రూ. 499 మాత్రమే. మరి, ఈ హైటెక్‌కార్ట్ వైర్‌లెస్ బ్లూటూత్ మల్టీఫంక్షన్ టచ్‌పాడ్ కీబోర్డు పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.