ఇప్పుడు అందరూ స్మార్ట్ వాచెస్ నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అనలాగ్ వాచెస్ ని కొనుగోలు చేసే వారి సంఖ్య బాగానే తగ్గిపోయింది. ముఖ్యంగా యువత స్మార్ట్ వాచెస్ అంటేనే మక్కువ చూపిస్తున్నారు. అందుకే ఎన్నో కంపెనీలు ఈ స్మార్ట్ వాచెస్ ని తయారు చేయడం ప్రారంభించాయి.
అనలాగ్ వాచెస్ కంటే కూడా ఇప్పుడు అందరూ స్మార్ట్ వాచ్ వినియోగానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. పైగా ఇప్పుడు అందరూ ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నారు. తమ శరీరంలో జరుగుతున్న మార్పులను నిరంతరం తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. అంతేకాకుండా స్పోర్ట్స్, వాకింగ్ వంటి యాక్టివిటీస్ కి సంబంధించి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పుడు స్మార్ట్ వాచెస్ ని వాడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా స్మార్ట్ వాచెస్ వినియోగం ఊపందుకుంది. ఎన్నో కంపెనీలు అతి తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో స్మార్ట్ వాచెస్ ని తయారు చేస్తున్నారు.
హ్యామర్ కంపెనీ నుంచి ఇప్పపటికే ఎన్నో స్మార్ట్ వాచెస్ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఆ కంపెనీ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్ వాచ్ ఒకటి మార్కెట్ లో విడుదలైంది. ఆ స్మార్ట్ వాచ్ ని బడ్జెట్ లో రిలీజ్ చేసినప్పటికీ అదిరిపోయే ఫీచర్స్ ఆ వాచ్ లో ఉన్నాయి. స్క్రీన్ కూడా 1.85 ఇంచెస్ లార్జ్ ఐపీఎస్ డిస్ ప్లోతో ఈ వాచ్ అందుబాటులోకి వచ్చింది. దీనిలో డ్యూయల్ మోడ్ కూడా ఉంది. అంటే మీరు ఈ స్మార్ట్ వాచ్ ని కనెక్ట్ చేసిన తర్వాత మీరు బ్లూటూత్ ఇయర్ బడ్స్ ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. కంటిన్యూస్ హెల్త్ మానిటరింగ్ కూడా ఉంది.
ఈ వాచ్ పూర్తి స్పెసిఫికేషన్స్ చూస్తే.. ఈ వాచ్ స్ట్రాంగ్ మెటాలిక్ బాడీ స్కిన్ ఫ్రెండ్ల్ స్ట్రాప్, క్రౌన్ హెడ్ తో వస్తోంది. ఈ వాచ్ తో మీరు మ్యూజిక్, కెమెరాని కంట్రోల్ చేయచ్చు. బ్లూటూత్ కాలింగ్ తో రెండ్రోజుల వరకు ఛార్జింగ్ వస్తుంది. కాలుక్యులేటర్, జీపీఎస్, అలార్మ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. 60 స్పోర్ట్స్ మోడ్స్ ఈ వాచ్ లో ఉన్నాయి. ఐపీ67 వాటర్- డస్ట్ రెసిస్టెన్స్ ఉంది. ఈ వాచ్ ధర విషయానికి వస్తే.. ఎమ్మార్పీ రూ.4,999గా ఉంది. దీనిని 69 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,541కే అందిస్తున్నారు. ఈ హ్యామర్ ఏస్ 3 స్మార్ట్ వాచ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.