అమరత్వం నమ్మకం ఉన్నా లేకపోయినా ఈ టాపిక్ పై మాట్లాడేందుకు, వినేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే చావుని జయించడం, చావు లేకుండా జీవిచడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీద గూగుల్ మాజీ ఇంజినీర్ రే ఖర్జ్ వాయల్ స్పందించారు.
అమరత్వం.. చాలా సినిమాల్లో, పురాణాల్లో ఈ కాన్సెప్ట్ గురించి వినుంటారు. అమరత్వం అంటే చావుని జయించడం. మరణం లేకుండా జీవించడం అనమాట. అయితే దీని గురించి మాట్లాడితే ఇప్పుడు అందరూ కాస్త భిన్నంగానే స్పందిస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనిషి ఆయుర్థాయం 65 ఏళ్లకు పడిపోయింది. ఇప్పుడు అసలు చావు లేకుండా జీవించడం గురించి మాట్లాడితే.. చాలా మంది దానిని జోక్ గానే తీసుకుంటారు. కానీ, గడిచిన కొన్నేళ్లుగా ఎంతోమంది శాస్త్రవేత్తలు ఇదే విషయంపై పరిశోధనలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు గూగుల్ మాజీ ఇంజినీర్ చేసిన వ్యాఖ్యలతో మరోసారి ఈ విషయం తెరపైకి వచ్చింది. అంతేకాకుండా జరిగే అవకాశం కూడా ఉందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈ విషయాన్ని వెల్లడించిన గూగుల్ మాజీ ఇంజినీర్ పేరు ‘రే ఖర్జ్ వాయల్’. గూగుల్ మాజీ ఇంజినీర్ గా ఈయన పేరు చాలా మందికి తెలియక పోవచ్చు. కానీ, టెక్నాలజీ జ్యోతిష్యుడుగా ఈయన చాలా మందికి సుపరిచితుడే. ఎందుకంటే సాంకేతికత మీద రే జోస్యం చెబుతుంటాడు. ఫలానా సంవత్సరంలో ఇలా జరుగుతుంది. అప్పటికి ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందంటూ చాలాసార్లు చెప్పాడు. ఆయన ఇప్పటి వరకు 147 సార్లు జోస్యం చెప్పగా 86శాతం సక్సెస్ రేట్ ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రే ఖర్జ్ వాయల్ చెప్పాడు అంటే అది కచ్చితంగా జరిగి తీరుతుంది అనే నమ్మకాన్ని పొందాడు.
2000 సంవత్సరంలో ప్రపంచ టాప్ చెస్ ప్లేయర్ ని ఒక కంప్యూటర్ ఓడిస్తుందంటూ 1990లోనే రే వెల్లడించారు. ఆ ఘటన 1997లోనే నిజమైంది. 2023నాటికి వెయ్యి డాలర్ల విలువైన కంప్యూటర్ మనిషి మెదడుకు ఉన్నంత శక్తి సామర్థ్యాలు ఉంటాయంటూ 2000 సంవత్సరంలోనే అంచనా వేశారు. ఇలాంటి అంచనాలు ఇంకా ఎన్నో చేశారు. తాజాగా రే ఖర్జ్ వాయల్ అమరత్వం గురించి వ్యాఖ్యలు చేశాడు. తన యూట్యూబ్ ఛానల్ కి చేసిన ఒక వీడియోలో ఇమ్మోర్టాలిటీ గురించి వ్యాఖ్యానించాడు. 2030నాటికి అమరత్వం సాధ్యమే అంటూ రే చెప్పుకొచ్చాడు. అందుకు సంబంధించిన కొన్ని విషయాలను కూడా చక్కగా వివరించారు.
రే చెప్పింది ఏంటంటే.. నానో టెక్నాలజీ, రోబోటిక్స్, జెనటిక్స్ సాయంతో 2023 కల్లా మనిషి చావును జయించవచ్చని స్పష్టం చేశారు. నానో టెక్నాలజీ సాయంతో ఇది తప్పుకుండా సాధ్యమవుతుందని వెల్లడించారు. ఈ నానో రోబోలను మనిషి శరీరంలోని సిరల్లో ప్రవేశపెడతారని తెలిపారు. అలా ప్రవేశపెట్టిన తర్వాత అవి రక్తంలో శరీరం మొత్తం సంచరిస్తూ ఉంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ.. దెబ్బతిన్న కణాలు, కణజాలాన్ని ఈ నానో రోబోలు పునరుద్ధరిస్తూ ఉంటాయని వివరించారు. 1970ల్లోనే ఈ నానో రోబోల మీద పరిశోధనలు ప్రారంభమయ్యాయి. నానో పదార్థాలను ఇప్పటికే టీకాల్లో ఉపయోగించారు. వ్యాధి నిర్ధారణ, వైద్యంలో కూడా ఈ నానో పదార్థాలను ఉపయోగిస్తూ సక్సెస్ అయిన సందర్భాలు కూడా చూశాం. రే ఖర్జ్ వాయల్ చెప్పినట్లు నిజంగానే చావుని జయించడం సాధ్యమేనా? మీ అభుప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#Google Former #Scientists #Ray kurzweil also a #eminent futurist has made a bold claim that humans will achieve #immortality with the help of #nanorobots in Just seven yrs.
He who has a history of accurate predictions with around 86% of his 147 predictions turning correctly. pic.twitter.com/PB1RvRo8eq
— Udaya (@UdayaLa62693825) April 10, 2023