స్మార్ట్ వాచ్ అనేది ఇప్పుడు చాలా మందికి అవసరంగా మారిపోయింది. మనిషి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకునేందుకు ఈ స్మార్ట్ వాచెస్ బాగా ఉపయోగపడతున్నాయి. అందుకే వీటికి మార్కెట్ లో బాగా డిమాండ్ పెరిగింది. ఇప్పుడు ఫైర్ బోల్ట్ కంపెనీ నుంచి ఒక అద్భుతమైన స్మార్ట్ వాచ్ విడుదలైంది.
స్మార్ట్ వాచ్ అనేది ఇప్పుడు అలంకారం మాత్రమే కాదు.. అవసరంగా మారిపోయింది. ఎందుకంటే అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది. కొత్తగా వస్తున్న స్మార్ట్ వాచ్ లలో హార్ట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్, బ్లడ్ గ్లూకోజ్ వంటి వాటిని మానిటర్ చేసేందుకు ఫీచర్స్ ఉంటున్నాయి. స్పోర్ట్స్ ఆడేవారికి కూడా కేలరీస్ కౌంట్, ట్రాకింగ్ వంటివి ఉంటాయి. ఇప్పుడు అలాంటి వారి కోసం ఫైర్ బోల్ట్ కంపెనీ ఒక స్పోర్టీ రగ్డ్ స్మార్ట్ వాచ్ ని తీసుకొచ్చింది. ఆ స్మార్ట్ వాచ్ ఫీచర్స్ ఏంటి? ఆ వాచ్ లో ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
స్మార్ట్ వాచెస్ పరంగా ఫైర్ బోల్ట్ కంపెనీకి మంచి గుర్తింపు ఉంది. ఇప్పటికే ఈ కంపెనీకి చెందిన ఎన్నో మోడల్స్ కి మంచి ఆదరణ లభించింది. కౌంటర్ పాయింట్ రిపోర్ట్ Q2 నివేదిక ప్రకారం ఫైర్ బోల్ట్ కంపెనీ ఇండియాలోనే నంబర్ వన్ స్మార్ట్ వాచ్ బ్రాండ్ గా నిలిచిందని చెబుతున్నారు. అంతర్జాతీయంగా నాలుగో స్థానంలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కంపెనీ నుంచి ఇప్పుడు స్పోర్టీ రగ్డ్ లుక్స్ లో స్పియర్ అనే స్మార్ట్ వాచ్ ని విడుదల చేశారు. నిజానికి ఈ స్మార్ట్ వాచ్ ఎమ్మార్పీ రూ.19,999గా నిర్ణయించారు. కానీ, లాంఛింగ్ ఆఫర్ కింద ఈ స్మార్ట్ వాచ్ ని కేవలం రూ.2,999కే అందిస్తున్నారు.
ఇంక ఈ స్మార్ట్ వాచ్ ఫీచర్ల విషయానికి వస్తే.. 1.6 ఇంచెస్ బిగ్ రెజ్ డీ డిస్ ప్లేతో వస్తోంది. దీనిలో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కూడా ఉంది. అలాగే షాక్ ప్రూఫ్ మెటల్ బాడీ ఈ వాచ్ లో ప్రత్యేకత. ఈ స్మార్ట్ వాచ్ లో 600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. సాధారణంగా వాడితే 8 రోజులు, బ్లూటూత్ కాలింగ్ తో 5 రోజులు, 25 రోజుల పాటు స్టాండ్ బై ఉంటుంది. స్క్రాచ్ రెసిస్టెన్స్, టఫ్ స్ట్రాప్, డ్యూయర్ క్రౌన్ హెడ్, హైలీ డ్యూరబుల్ గ్లాస్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇన్ని ఫీచర్లతో వస్తున్న ఈ స్మార్ట్ వాచ్ ని కేవలం రూ.2,999కే అందిచడం చాలా గొప్ప విషయం అంటూ టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి.. ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ లుక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Fire-Boltt Sphere Smartwatch | Features and Specs
Full Specs: https://t.co/Fk1L7w3HST#FireBoltt #Sphere #Smartwatch #FireBolttSphere #Wearable #fdaytalk pic.twitter.com/2b9h29Itwn
— fdaytalk (@fdaytalk) February 28, 2023