రాను.. రాను.. స్మార్ట్‌వాచ్ లకు ఆదరణ పెరుగుతోంది. స్టైలిష్ లుక్ కోసం కొందరు.. ఆరోగ్యంపై శ్రద్ధతో మరికొందరు.. వీటిని ఎగబడీ మరీ కొంటున్నారు. ఇవేకాకుండా.. కాలింగ్ ఆప్షన్, స్పోర్ట్స్ మోడ్, వాయిస్ ఫీచర్.. వంటి అన్ని స్మార్ట్ ఫోన్ ఫీచర్స్.. వాచ్ లోనే ఉంటుండడంతో బాగా అట్ట్రాక్ట్ అవుతున్నారు. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న టెక్నాలజీ కంపెనీలు.. స్టైలిష్ లుక్ తో యువతను, హెల్త్ ఫీచర్స్ తో పెద్దవారిని వలలో పడేస్తున్నాయి. తాజాగా.. దేశీయ బ్రాండ్ ఫైర్ బోల్ట్.. ‘ఫైర్ బోల్ట్ విజనరీ‘ అను స్మార్ట్‌వాచ్ ను లాంచ్ చేసింది. అంతేకాకుండా.. ఇంట్రడక్టరీ ఆఫర్ లో భాగంగా భారీ డిస్కౌంట్ ప్రకటించింది.
ఫైర్ బోల్ట్ విజనరీ స్మార్ట్‌వాచ్.. అసలు ధర రూ. 16,999 కాగా.. ఇంట్రడక్టరీ ధర రూ.3,799గా ఉంది. అంటే.. లాంచింగ్ ఆఫర్ కింద రూ. 13వేలు డిస్కౌంట్ ప్రకటించింది. జూలై 22 నుంచి ఈ-కామర్స్ సైట్ అమెజాన్, అఫిషియల్ ఫైర్-బోల్ట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. బ్లాక్, బ్లూ, షాంపైన్ గోల్డ్, డార్క్ గ్రే, గోల్డ్, గ్రీన్, పింక్, సిల్వర్ కలర్ ఆప్షన్స్‌లో ఈ వాచ్ లభిస్తుంది.
1.78 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేతో, స్క్వేర్ షేప్ లో ఉంటుంది. 368×448 పిక్సెల్స్ రెజల్యూషన్ ఉంటుంది. 100కుపైగా స్పోర్ట్స్ మోడ్స్‌కు ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఇందు కోసం ఇన్‌బుల్ట్‌గా మైక్రోఫోన్, స్పీకర్ ఉంటాయి. మొబైల్‌కు కనెక్ట్ అయినప్పుడు కాల్స్ ఫంక్షనాలిటీ ఉపయోగించుకోవచ్చు. వాచ్ ద్వారానే కాల్స్‌కు ఆన్సర్ చేయవచ్చు. కాల్స్ చేసుకోవచ్చు. ఇందుకోసం డయల్ ప్యాడ్ ఆప్షన్ కూడా వాచ్‌లో ఉంటుంది. ఫోన్‌ను సింక్ చేసుకొని రీసెంట్ కాల్స్, కాంటాక్ట్‌లను కూడా వాచ్‌లోనే పొందవచ్చు. ఎస్ఎంఎస్‌లు, నోటిఫికేషన్ల అలెర్ట్‌లు కూడా వాచ్‌లో పొందవచ్చు.
హార్ట్‌రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్, స్లీప్ ట్రాకర్, డిస్టెన్స్ ట్రాకర్.. వంటి హెల్త్ ఫీచర్స్ ఉంటాయి. కెమెరా ఆప్షన్ కూడా ఉంది. ఇందులో 128ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. దీంతో పాటలు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్‌కు టీడబ్ల్యూఎస్‌ను కూడా కనెక్ట్ చేసుకొని మ్యూజిక్ వినొచ్చు. ఇందులో 250ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఐదు రోజుల బ్యాటరీ లైఫ్ వస్తుందని ఫైర్ బోల్ట్ పేర్కొంది.
ఇది కూడా చదవండి: ఆఫర్ల వర్షం కురిపిస్తున్న ఫ్లిప్‌కార్ట్.. Oppo స్మార్ట్ ఫోన్ పై 10,000 డిస్కౌంట్!
ఇది కూడా చదవండి: Vivo: 50ఎంపీ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లతో.. VIVO నుంచి చౌక స్మార్ట్ ఫోన్!