స్మార్ట్ ఫోన్ కొనాలనే కోరిక అందరకి ఉంటుంది. కానీ, ధర ఎక్కువుగా ఉండడం వల్ల వాటికి దూరంగా ఉంటున్నారు. అయితే.. ఈకామర్స్ సైట్ల గురుంచి తెలిసిన వాళ్ళు మాత్రం.. ఏదైనా మంచి ఆఫర్ రాకపోతుందా! ధర తగ్గకపోతుందా! అని వేచి చూస్తుంటారు. అలాంటి వారికి ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ శుభవార్త చెప్పింది. ఎలక్ట్రానిక్స్ డేస్ పేరిట సేల్ నిర్వహిస్తూ స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది. అందులో భాగంగా ఒప్పో స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.10,000 తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా.. బ్యాంక్ ఆఫర్, ఈఎంఐ ఆప్షన్ వంటి మరెన్నో సదుపాయాలు ఉన్నాయి. ఒప్పో ఎఫ్19 సిరీస్‌లోని 'ఎఫ్19 ప్రో+' మోడల్ కు ఈ ఆఫర్ వర్తిస్తోంది. ఒప్పో ఎఫ్19 ప్రో+.. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.29,990 కాగా.. ఫ్లిప్‌కార్ట్ 33% డిస్కౌంట్ ప్రకటించి రూ.19,990కే అందిస్తోంది. అంటే అసలు ధరతో పోలిస్తే రూ.10,000 తగ్గింపు లభిస్తోంది. అలాగే.. కొనుగోలు సమయంలో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించినట్లైతే అదనంగా 10 శాతం అంటే.. 1,500 తగ్గింపు లభిస్తుంది. తద్వారా రూ.18,490కే ఈ స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. దీనిపై ఈఎంఐ ఆప్షన్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ వంటి మరిన్ని సదుపాయాలు కూడా ఉన్నాయి. ఒప్పో ఎఫ్19 ప్రో+ స్పెసిఫికేషన్స్: 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్ వెనుకవైపు క్వాడ్ కెమెరా సెటప్(48ఎంపీ+ 8ఎంపీ+ 2ఎంపీ+ 2ఎంపీ) సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్ ఫీచర్ 4,310ఎంఏహెచ్ బ్యాటరీ 50వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీ OPPO F19 Pro+ 5G pic.twitter.com/ZygCqAtSDm — Govardhan Reddy (@gova3555) July 16, 2022 Oppo F19 Pro+ Specifications pic.twitter.com/knGDUTMlFa — Govardhan Reddy (@gova3555) July 16, 2022 ఈ ఆఫర్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.