టెక్నాలజీ అందుబాటులోకి వచ్చే కొద్దీ మనిషి జీవన విధానం సులభతరమవుతోంది. అన్వేషణలు వేగవంతం అవుతున్నాయి. కొత్త కొత్త వస్తువులను సృష్టిస్తున్నారు. ఎక్కడా విన్నా.. 'స్మార్ట్' న్నా పేరు ఎక్కువుగా వినపడుతోంది. స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, స్మార్ట్ టీవీ.. ఇలా అన్నింటా స్మార్ట్ డివైజ్ లకు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో విద్యుత్ సమస్యల నుంచి ఇంట్లోని వస్తువులను కాపాడే 'స్మార్ట్ డివైజ్' గురుంచి సమాచారం మీకోసం..
మనిషి నిద్రలేచింది మొదలు ఉరుకుల పరుగుల జీవితం. ఈ క్రమంలో కొన్ని పనులు సక్రమంగా చేసినా.. మరికొన్ని మర్చిపోతుంటాం. అందులో ముఖ్యమైనవి ఇంట్లోని టీవీ, ఏసీ, ఫ్యాన్ వంటి ఎలక్ట్రిక్ వస్తువులు. తిరిగి వెనక్కి వచ్చి వాటిని ఆపేద్దామనుకున్నా ఒక్కోసారి అంత సమయం ఉండదు. పోనీ అలానే వదిలేద్దామా..? పవర్ హెచ్చు తగ్గులు అయినప్పుడు అవి కాలిపోతాయి. ధర తక్కువ ఉన్న వస్తువులైతే పర్లేదు కానీ లక్షలు పోసి కొన్న వస్తువులు కకాలిపోతే ఎక్కువ నష్టం భరించాల్సి ఉంటుంది. వీటన్నింటికి పరిష్కారం చూపే స్మార్ట్ డివైజ్ మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఈ పరికరం పవర్ హై వోల్టేజ్/లో వోల్టేజ్ వచ్చిన సమయాల్లో మొత్తం ఇంట్లోని విద్యుత్ సరఫరానే నిలిపివేస్తుంది.
సామాన్యుల నుంచి సంపన్నుల వరకు.. రైతుల నుంచి ఉద్యోగుల వరకు అందరిదీ విరామం లేని పోరాటమే. ఈ హడావుడి జీవితాల్లో.. విద్యుత్ వాడకం పెరగగా… వృథా కూడా ఎక్కువే అవుతోంది. దీనికితోడు విద్యుత్ ఎక్కువ తక్కువ వచ్చినపుడు ఇంట్లోని వస్తువులు కాలిపోవడం. పల్లెల్లో ఇలాంటి సమస్యలు ఎక్కువ. రాత్రి ‘కరెంట్’ పోయి వచ్చినపుడు మా టీవీ కాలిపోయింది.. మా ఫ్రిడ్జ్ కాలిపోయింది..’ అని చెప్తుంటారు. అలాగే, బావుల దగ్గర నిర్మించే విద్యుత్ మోటార్లది ఇదే ప్రధాన సమస్య. పవర్ హై వోల్టేజ్/లో వోల్టేజ్ వచ్చిన సందర్భాల్లో మోటార్లలోని వైండింగ్ కాలిపోతుంటది. దీనిని బాగు చేయాలంటే మోటార్ కంపెనీని విలువ బట్టి ఆ ఖర్చు వేలల్లో ఉంటుంది.
వీటన్నటికీ పరిష్కారం చూపేదే ‘స్మార్ట్ డివైజ్’. ఇదో చిన్నపాటి పరికరం. దీన్ని ఇంట్లోకి పవర్ సరఫరా కంట్రోల్ చేసే బోర్డు వద్ద ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే.. సాధారణంగా ఇళ్లలోకి వచ్చే ఇన్ ఫుట్ సప్లై 230 వోల్ట్స్. దీనికి కొంచెం అటుగా.. ఇటుగా ఉంటే పర్లేదు. అదే 300 వోల్ట్స్ ధాటిపోయిందనుకోండి. ఇంట్లోని వస్తువులును బాణాసంచాల్లా టపటపామని పేలతాయి. పోనీ అప్రమత్తమవుదామనుకున్నా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అలాగే, లో వోల్టేజ్ వచ్చిన సందర్భాల్లోనూ ఇలానే జరుగుతూ ఉంటుంది. వీటి నుంచే రక్షించేదే.. స్మార్ట్ డివైజ్. ఈ డివైజ్ ని ఏర్పాటు చేసుకోవడం వల్ల పవర్ హెచ్చు తగ్గులు వచ్చినపుడు ఇంట్లోని మొత్తం కరెంటు సప్లైని నిలిపివేస్తుంది. దీని వల్ల వస్తువులు కాలిపోకుండా ఉంటాయి. ఇదే కాదు.. మనిషికి హానికరం అనిపించే ఏ పనినైనా ఆపుదల చేస్తుంది. ఈ పరికరం గురుంచి మరింత సమాచారం కోసం.. కింది వీడియో చూసేయండి..