ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే టెక్ రంగంలో ఏఐ చాట్ బాట్ల గురించి పెద్దఎత్తునే చర్చ జరుగుతోంది. కొందరు సమర్థిస్తుంటే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ ఏఐ చాట్ బాట్స్ వల్ల తమ ఉద్యోగాలకే ప్రమాదం ఉందని చాలామంది వాదిస్తున్నారు.
ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ ఏఐ టెక్నాలజీ గురించే చర్చ జరుగుతోంది. దిగ్గజ టెక్ కంపెనీలు కూడా ఈ ఏఐ టెక్నాలజీపైనే భారీ పెట్టుబడులు పెడుతున్నారు. ఈ ఏఐ చాట్ బాట్ కి ఫ్యాన్స్ ఉన్నారు, దీనిని వ్యతిరేకించే వాళ్లు కూడా ఉన్నారు. దీని వల్ల ఉద్యోగాలు పోతాయంటూ చాలా మంది మొత్తుకుంటున్నారు. పైగా, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ రీప్లేస్ చేయగల ఉద్యోగాలు ఏంటని అడగ్గా.. 20 రకాల ఉద్యోగాల జాబితాను ఇచ్చింది. అయితే ఈ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ పై ఆశలు పెట్టుకున్న వాళ్లు.. వెనకేసుకొచ్చే వాళ్లు కూడా లేకపోలేదు. ఓ కంపెనీ అయితే తమ సీఈవోగా ఒక ఏఐ చాట్ బాట్ ని నియమించింది.
ఏఐ చాట్ బాట్ ని తమ అవసరాలకు వాడుకోవడం మాత్రమే కాదు.. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ఓ గేమింగ్ కంపెనీ తమ సీఈవోగా నియమించింది. చైనీస్ గేమింగ్ కంపెనీ నెట్ డ్రాగన్ గతేడాది ఆగస్టులో టాంగ్ యూ అనే ఏఐ చాట్ బాట్ ని తమ కంపెనీ సీఈవోగా నియమించింది. నెట్ డ్రాగన్ అనేది చాలా మంచి పేరున్న చైనీస్ గేమింగ్ కంపెనీ. వాళ్లు ఏఐ చాట్ బాట్ ని సీఈవోగా నియమించారని తెలుసుకుని చాలా మంది ఆశ్చర్యపోయారు. అయితే ఆ కంపెనీ ఏదైతే నమ్మి చాట్ బాట్ ని సీఈవోగా నియమించిందో.. అది జరిగింది. టాంగ్ యూ సీఈవో అయిన తర్వాత మార్కెట్ లో ఆ కంపెనీ వాల్యూ 10 శాతం పెరిగింది.
నెట్ డ్రాగన్ అనే కంపెనీ 1999లో ప్రారంభమైంది. ఎన్నే పాపులర్ మల్టీప్లేయర్ వీడియో గేమ్స్ ని ఈ కంపెనీ తయారు చేసింది. యూ డీమన్స్ ఆన్ లైన్, హీరోస్ ఇవోల్వ్ డ్, కాంకర్ ఆన్ లైన్ వంటి పాపులర్ గేమ్స్ ని డెవలప్ చేశారు. టాంగ్ యూని సీఈవోగా నియమించడంపై ఆ కంపెనీ ఎంతో విశ్వాసంతో ఉంది. డెసిషన్ మేకింగ్, రిస్క్ మేనేజ్మెంట్, ఉద్యోగుల కోసం మంచి పారదర్శక వాతావరణాన్ని తయారు చేయగలదని నెట్ డ్రాగన్ నమ్ముతోంది. 2017లో అలీ బాబా ఫౌండర్ జాక్ మా చెప్పిందే జరిగేలా ఉంది. ఆయన వచ్చే 30 ఏళ్లలో టైమ్ మ్యాగజీన్ కవర్ పేజ్ మీద బెస్ట్ సీఈవోగా ఒక రోబో ఉంటుందేమో అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అదే నిజం అయ్యేలా ఉందనే అభిప్రాయాలు వినిపిస్తన్నాయి. మనిషి బదులు ఏఐ చాట్ బాట్ సీఈవోగా సమర్థంగా పని చేస్తుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.