కొత్త సంవత్సరం సమీపిస్తోంది. ఈ సందర్భంగా స్నేహితులు, ఆత్మీయులు, ప్రియమైన వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెబితే ఎంతో బాగుంటుందాని ప్రతి ఒక్కరు ఆలోచించేదే. గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేయాలనుకుంటుంటారు. అలాంటి బహుమతిని ఏదో ఒకటిలే అన్నట్లుగా కాకుండా.. నలుగురికి నచ్చేలా, దానివైపు చూసినపుడు మీరే గుర్తొచ్చేలా ఉండాలి. అంతేకాదు.. ఆ బహుమతి మీపై ఎదుటివారికి అభిమానాన్ని రెట్టింపు చేసేలా ఉండాలి. అలాంటి కొన్ని గిఫ్ట్ ఐడియాస్ తీసుకొచ్చాం. వీటిలో మీకు నచ్చింది కొనేసి.. మీ ఆత్మీయులకు గిఫ్ట్ గా ఇవ్వండి.
మారుతున్న సాంకేతికతతో మనిషి జీవనం కూడా ఎంతో సులభతరంగా మారిపోయింది. ఒకప్పుడు సెల్ ఫోన్ ఉంటేనే ఎంతో గొప్పగా చూసేవారు. ఇప్పుడు చేతి వాచ్ నుంచే ఫోన్ చేసి మాట్లాడే దాకా టెక్నాలజీ అభివృద్ధి చెందింది. దీనికి తోడు హెల్త్ ఫీచర్లు, ఫిట్నెస్ ఫీచర్లు అన్ని వయసుల వారిని ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు.. స్మార్ట్ వాచులు చూడడానికి ఆకర్షణీయంగా, స్టయిలిష్ గా ఉంటున్నాయి. అలాంటి స్మార్ట్ వాచ్ గిఫ్టుగా ఇవ్వడం అన్నిటి కంటే ఉత్తమమైనది.
వన్ ప్లస్ నార్డ్ వాచ్ – రూ. 4,998
రెడ్‌మీ వాచ్ 2 లైట్ – రూ. 3,499
రియల్‌మీ వాచ్ 3(Renewed) – రూ. 1,999
నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 4 – రూ. 3,499
పెబుల్ కాస్మోస్ ప్రైమ్ – రూ.3,699
జీవన శైలి మారింది.. ఒత్తిడి పెరిగి పోయింది. అనేక రకాల అనారోగ్య సమస్యలు చుట్టు ముడుతున్నాయి. చిన్న వయసులోనే చాలా మంది అనేక రకాల రోగాలతో బాధ పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఆరోగ్యంగా శ్రద్ధ తీసుకోవడం ఎంతో ముఖ్యం. అందుకు ఫిట్‌నెస్ బాండ్‌లు ఎంతో సహాయ పడతాయి.ఎప్పటికప్పుడు హెల్త్ అప్‌డేట్లను ఇస్తాయి. శరీరం ఫిట్‌గా, హెల్తీ ఉండాలని భావిస్తున్నట్లయితే.. ఫిట్‌నెస్ బాండ్‌లు కొనుగోలు చేయండి. వీటి సాయంతో మీరు ఫిట్‌గా ఉండొచ్చు.
రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో – రూ. 2,699
సంగీతాన్ని ఇష్టపడని వారు ఉంటారా! ఉండకపోవచ్చు.. మనసు బాగోలేకనప్పుడు అభిరుచికి తగ్గట్టుగా కాసేపు మ్యూజిక్ వింటే ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. ప్రత్యేకించి ఇంట్లో స్పీకర్లు ఉంటే ఆ సంబరమే వేరు. అందులోనూ.. చేయి కదపకుండా ‘ Hi Siri’ అంటూ నోటితో ఆజ్ఞలు ఇస్తూ.. పాటలు వింటుంటే ఆ మజాయే వేరు.
అమెజాన్ ఎకో డాట్ (4వ తరం) – రూ. 3,999
క్లాక్‌తో అమెజాన్ ఎకో డాట్ (4వ తరం) – రూ. 4,999
అమెజాన్ ఎకో డాట్ థర్డ్ జెనరేషన్ స్మార్ట్ స్పీకర్స్ – రూ. 3,499
దేశంలో టీడబ్లూఎస్ వైర్లెస్ ఇయర్‌బడ్స్ మార్కెట్ గణనీయంగా పుంజుకుంటోంది. అన్ని మొబైల్ తయారీ కంపెనీలు ఇయర్‌బడ్స్ మార్కెట్‌పై దృష్టి పెట్టాయి. యాపిల్ కంపెనీ 2016లో మొట్టమొదటి సారి ఎయిర్‌పాడ్‌ను ఐఫోన్7తో పాటు ఇంట్రడ్యూస్ చేసింది. అనంతరం కొద్ది కాలంలోనే వీటి మార్కెట్ గణనీయంగా పెరిగింది. మీరు బెస్ట్ ఇయర్‌బడ్స్ కోసం చూస్తున్నట్లయితే.. వీటిపై ఓ లుక్కేయండి.
జెబిఎల్ ట్యూన్ 130ఎన్సీ – రూ. 4,499
ఒప్పో ఎంకో బడ్స్ ఎయిర్ 2 ప్రో – రూ. 3,499
వన్ ప్లస్ బడ్స్ Z2 – రూ. 4,999 04.
రియల్ మీ బడ్స్ ఎయిర్ 3 – రూ. 3,999
వీటితో పాటు కొంచెం ఎక్కువ బడ్జెట్ లో స్మార్ట్ ఫోన్లు గిఫ్ట్ గా ఇవ్వాలనుకునే వారి కోసం తక్కువ ధరలో ఫాస్ట్ ఛార్జింగ్ తో వచ్చే బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ల లిస్ట్ ను కూడా అందిస్తున్నాము. దేశంలో 5జి సేవలు అందుబాటులోకి వచ్చిన తరుణంలో స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ గా ఇవ్వాలనుకోవడం సరైన నిర్ణయమే.
ఐక్యు జెడ్ -6 – రూ.16,999
పోకో ఎం4 ప్రో 5G – రూ.13,299
శాంసంగ్ గ్యాలక్సీ ఎం13 5G – రూ.13,999
రెడ్‌మీ నోట్ 11టి 5G – రూ.17,999
రియల్ మీ నార్జో 50 5G – రూ. 16,490