గత నెల న్యూజిలాండ్‌తో టెస్టు మ్యాచ్ సందర్భంగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ జో రూట్ బ్యాట్‌ను నేలపై నిటారుగా చేతితో పట్టుకోకుండా నిలబెట్టాడు. రూట్ అలా బ్యాట్ నిలబెట్టిన వీడియో అప్పుడు వైరల్‌గా మారింది. మ్యాజిక్ చేసి గాల్లో బ్యాట్ నిలబెట్టాడంటూ బోలెడు వార్తలు వచ్చాయి. తన బ్యాట్ కింది భాగం ఫ్లాట్‌గా ఉండడంతో రూట్ బ్యాట్‌ను అలా నిలబెట్టినట్లు తర్వాత తెలిసింది.
కాగా రూట్ బ్యాట్‌తో చేసిన మ్యాజిక్‌ను ఇంగ్లండ్‌తో రీ షెడ్యూల్డ్ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం ప్రయత్నించాడు. కానీ.. రూట్‌లా కోహ్లీ బ్యాట్‌ను నిలబెట్టలేకపోయాడు. ఆ విషయం కూడా క్రికెట్ వర్గాల్లో వైరల్ అయింది. ఇప్పుడు మరోసారి రూట్ బ్యాట్ మ్యాజిక్ విషయం వార్తల్లో నిలిచింది. అందుకు కారణం.. టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సైతం రూట్‌లా బ్యాట్ మ్యాజిక్ చేసేందుకు ప్రయత్నించాడు.
ఆదివారం భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో వన్డే సందర్భంగా ఇంగ్లండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బౌలింగ్ చేసేందుకు వచ్చిన చాహల్.. ఇంగ్లండ్ బ్యాటర్ బ్యాట్ తీసుకుని.. రూట్‌లో నిలబెట్టేందుకు ప్రయత్నించాడు. కానీ.. చాహల్ కూడా కోహ్లీలానే విఫలం అయ్యాడు. రూట్ బ్యాట్ మ్యాజిక్‌ను రిపీట్ చేద్దామనుకున్న చాహల్ ఆశలు ఆడియాశలే అయ్యాయి.
చాహల్ బ్యాట్ నిలబెట్టేందుకు ప్రయత్నించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రూట్‌కు మాత్రమే సాధ్యమైన ఈ మ్యాజిక్‌ను చాహల్ కూడా చేయలేకపోయాడే అంటూ అభిమానులు నిరాశ చెందుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Chahal & kohli trying Joe root’s Bat trick 😂 #INDvENG pic.twitter.com/rWbGrWOJVN
— Cricpedia (@_Cricpedia) July 18, 2022