టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ చాలా ఏళ్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడాడు. ఈ సీజన్లో మాత్రం రాజస్థాన్ రాయల్స్‌కు ఆడనున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్‌కు ముందు మెగా వేలంలో చాహల్‌ను రూ.6.5 కోట్లకు రాజస్థాన్ దక్కించుకుంది. నిజానికి చాహల్‌ను ఆర్సీబీ రిటేన్ చేసుకుంటుందని అంతా భావించారు. కానీ విరాట్ కోహ్లీ, మాక్స్వెల్, సిరాజ్ మాత్రమే ఆర్సీబీ రిటేన్ చేసుకుని, చాహల్‌ను రిలీజ్ చేసింది. ఈ విషయంలో ఆర్సీబీ ఫ్యాన్స్ షాక్ అయ్యారు.
2014 నుంచి ఆర్సీబీకి ఆడుతున్న చాహల్ ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించాడు. 114 మ్యాచ్‌లలో 139 వికెట్లు పడగొట్టాడు. ఇలాంటి బౌలర్‌ను ఆర్సీబీ వదులుకుని తప్పు చేసిందని అంతా భావించారు. కానీ.. ఆర్సీబీ నుంచి చాహల్ కావలనే బయటికి వచ్చాడని.. ఆ జట్టుతో ఉండేందుకు ఎక్కువ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఆర్సీబీ వీడడంపై చాహల్ స్పందించాడు. ‘ఐపీఎల్లో బెంగళూరుకు కాకుండా వేరే జట్టుకు ఆడతానని అనుకోలేదు. ఎందుకంటే ఆ జట్టుతో నా అనుబంధం అలాంటిది. ఆర్సీబీ సభ్యులు, అభిమానులతో నేను బాగా మమేకమైపోయాను. అయితే ఐపీఎల్ -2022 రిటెన్షన్ సమయంలో జరిగిన కొన్ని పరిణామాల కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో జట్టును వీడాల్సి వచ్చింది. అయితే ఆర్సీబీలో కొనసాగేందుకు నేను ఎక్కువ డబ్బులు డిమాండ్ చేశానని కొందరు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు. ఆ వార్తలన్నీ అవాస్తవాలు. నిజానికి ఆర్సీబీ నన్ను రిటేన్ చేసుకునేందుకు కానీ, వేలంలో తిరిగి దక్కించుకునేందుకు కానీ ఆసక్తి చూపలేదు.
ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియకు ముందు ఆర్సీబీ డైరెక్టర్ మైక్ హెస్సన్ నాకు ఫోన్ చేశారు. రిటెన్షన్‌లో మూడు స్థానాలు కోహ్లీ, మ్యాక్స్ వెల్, సిరాజ్‌లతో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. దీనికి నేను ఏ మాత్రం బాధపడలేదు. హెస్సన్ నన్ను వేలంలో దక్కించుకుంటానని చెప్పి ఉంటే ఎంతో సంతోషించేవాడినని. కానీ అతనేమీ చెప్పలేదు. అది నన్ను బాగా బాధించింది. ఏదేమైనా నేను ఐపీఎల్ అరంగేట్రం చేసిన జట్టుకే తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పుకొచ్చాడు. మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభించనున్నాడు. మరి చాహల్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IPL మొదలైన రెండో రోజు హిస్టరీ క్రియేట్ అయింది! చెత్త రికార్డులో..
#YuzvendraChahal has opened up on Royal Challengers Bangalore (RCB) not retaining him ahead of the ongoing edition of the tournament#RCB #RR #IPL2022https://t.co/hI8tf4TjcP
— CricketNDTV (@CricketNDTV) March 29, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.