కామన్వెల్త్ లాంటి ప్రతిష్టాత్మక వేదికపై ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్.. గెలిస్తే తొలి గోల్డ్ మెడల్. అప్పటికే మ్యాచ్ చేతుల్లో ఉంది. కానీ విజయం ఖాయం కాలేదు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య టీమిండియా క్రికెటర్ యాస్తిక భాటియా క్రీజ్‌లోకి వెళ్లే టైమొచ్చింది. 18వ ఓవర్ తొలి బంతికి రాధా యాదవ్ అవుట్ అవ్వడంతో 8వ స్థానంలో యాస్తిక భాటియా బ్యాటింగ్‌కు వెళ్లాలి. అప్పటికే భరించలేని టెన్షన్‌తో మ్యాచ్ చూస్తున్న ఆమె బ్యాటింగ్‌కు వెళ్లాలి అనగానే కొంత కంగారు పడింది. ఈ కంగారులో డగౌట్ ముందు ఉన్న బోర్డును దాటే క్రమంలో కింద పడింది. దీంతో భారత బృందం మొత్తం ఒక్కసారిగా పక్కున నవ్వారు. కానీ ఈ నవ్వులు ఎక్కువ సేపు నిలవలేదు.
ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడంతో టీమిండియా క్రికెటర్ల ముఖాలు వాడిపోయాయి. కాగా యాస్తిక భాటియా కింద పడ్డ దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో భారత్ 19.3 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటై.. 9 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో గోల్డ్ మెడల్ ఆస్ట్రేలియాకు, సిల్వర్ మెడల్ ఇండియాకు దక్కాయి. మరి ఈ మ్యాచ్‌లో యాస్తిక భాటియా కింద పడ్డ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Thats the summary of today’s match #INDvsAUS pic.twitter.com/ENSYvpGKIq
— Darshan S. Bhosale (@DarshanBhosale2) August 7, 2022
ఇది కూడా చదవండి: వీడియో: స్టన్నింగ్ క్యాచ్, ఊహించని రనౌట్‌తో అదరగొట్టిన టీమిండియా ప్లేయర్!