WWE..ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న మెగా రెజ్లింగ్ టోర్నీ. ఈ టోర్నీ ద్వారా ఎంతో మంది రెజ్లర్లు అభిమానులకు దగ్గరైయ్యారు. ఇక WWE రెజ్లింగ్ లో పరిచయం అక్కర్లే ని పేరు హల్క్ హోగన్. వరల్డ్ రెజ్లింగ్ సూపర్ స్టార్స్ లో ఒకడైన హోగన్ కు వరల్డ్ వైడ్ గా అభిమానులు ఉన్నారు. తన ఫైట్స్ తో కాకుండా తనదైన బాడీ లాగ్వేజ్ కోట్లలో అభిమానులను సొంతం చేసుకున్నాడు ఈ స్టార్ రెజ్లర్. అయితే అతడు పొరపాటున చేసిన అసభ్యకరమైన ట్వీట్ ఇప్పడు నెట్టింట వైరల్ గా మారింది. దాంతో తన తప్పును తెలుసుకున్న హోగన్ ఆ ట్వీట్ ను తొలగించాడు. అయినప్పటికీ స్క్రీన్ షాట్స్ రూపంలో అది నెట్టింట్లో చక్కర్లు కొడుతూనే ఉంది. ఇంతకి అతడు చేసిన ట్వీట్ ఏం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
హల్క్ హోగన్.. WWE సూపర్ స్టార్లలో ఒకడిగా.. హాల్ ఆఫ్ ఫేమ్ లో సభ్యుడిగా కూడా ఉన్నాడు. రింగ్ లో ప్రత్యర్థులను మట్టికరిపించడమే కాకుండా, తనదైన బాడీ లాంగ్వేజ్ తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇంతటి ఘనత సాధించిన హోగన్ ను ఒకే ఒక్క ట్వీట్ చిక్కుల్లో పడేసింది. ఇంతకీ ఆ ట్వీట్ లో ఏముందంటే? “టాయిలెట్ పేపర్స్ అయిపోయాయి.. కాస్త సహయం చెయ్ బ్రదర్” అని ఉంది. అయితే ఆ మెసేజ్ ను తన బ్రదర్ కు పంపాల్సిది. పొరపాటున ట్వీటర్ లో పెట్టేశాడు. దాంతో ఆ ట్వీట్ క్షణాల్లో వైరల్ అయ్యింది.
Goodnight HULKAMANIACS and jabronie marks without a life that don’t know it a work when you work a work and work yourself into a shit, marks pic.twitter.com/9GHA5cbn3g
— David Bixenspan (@davidbix) January 25, 2023
ఈ క్రమంలోనే ఆ ట్వీట్ కు అసభ్యకరమైన కామెంట్స్ రావడంతో.. తప్పు తెలుసుకున్న హోగన్ వెంటనే ఆ ట్వీట్ ను తొలగించాడు. అయినప్పటికీ స్క్రీన్ షాట్స్ రూపంలో అది నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంది. అయితే హల్క్ ఇలా పొరపాటుగా ట్వీట్ చేయడం ఇదే మెుదటిసారి కాదు. గతంలో కూడా పలు సార్లు ఇలాంటి తప్పుడు ట్వీట్స్ తో తెగ ఇబ్బందులు పడ్డాడు. ఇక WWEలో 1977 నుంచి 2012 వరకు రెజ్లింగ్ లో సూపర్ స్టార్ గా వెలుగొందాడు హోగన్. పలుమార్లు WWE ఛాంపియన్ షిప్ లు కూడా కైవసం చేసుకుని నంబర్ వన్ స్థానంలో కూడా కొన్నేళ్ల పాటు కొనసాగాడు.
what in the world pic.twitter.com/qvD76IqG9s
— David Bixenspan (@davidbix) January 25, 2023