క్రికెట్‌లో చోకర్స్ అంటే వాళ్లే.. ఏ మెగా టోర్నీలో అయినా ఆరంభంలో అద్భుతంగా ఆడి నాటౌట్‌లో ఒత్తిడికి చిత్తు అయ్యే జట్టు. ఇప్పటి వరకు ఒక్క వరల్డ్ కప్ ఫైనల్ కూడా ఆడని జట్టు సౌతాఫ్రికా.. తొలి సారి ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరింది.
క్రికెట్‌లో ఒత్తిడికి చిత్తు అయ్యే జట్టు ఏదైనా ఉందంటే అది సౌతాఫ్రికా జట్టే. ముఖ్యంగా ఐసీసీ మెగా ఈవెంట్స్‌లో సౌతాఫ్రికా ఆడే తీరు చూసి ఎవరైనా అనుకునేది.. వీళ్లకున్నంత దరిద్రం ఇంకెవరికీ ఉండదేమో అని. లీగ్ దశలో బెబ్బులిలా చెలరేగా ప్రొటీస్ జట్టు. సెమీ ఫైనల్స్, నాకౌట్ మ్యాచ్‌లలో మాత్రం దారుణంగా, పసికూన కంటే అధ్వానంగా ఆడి.. ఫైనల్‌కు చేరకుండా టోర్నీకి దూరం అవుతుంది. అందుకే వారిని ‘చోకర్స్’ అంటుంటారు. క్రికెట్‌లో వరల్డ్ కప్స్ ప్రారంభమైనప్పటి నుంచి సౌతాఫ్రికా పురుషుల జట్టు కానీ, మహిళల జట్టు కానీ.. ఏ ఫార్మాట్‌లో కూడా ఇప్పటి వరకు ఫైనల్ ఆడలేదు.
ఈ చెత్త రికార్డును బ్రేక్ చేస్తూ.. తొలి సారి ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2023లో సౌతాఫ్రికా ఫైనల్ చేరి చరిత్ర సృష్టించింది. సొంతగడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్‌లో తొలి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓడినా.. తిరిగి పుంచుకుని సెమీస్ చేరింది. తొలి సెమీస్‌లో భారత్-ఆస్ట్రేలియా ఆడగా.. ఇండియా పోరాడి ఓడి ఇంటిదారి పట్టింది. ఆసీస్ ఫైనల్ చేరింది. ఇక రెండో సెమీస్‌లో ఇంగ్లండ్-సౌతాఫ్రికా జట్ల మధ్య ఉండగా, క్రికెట్‌పై కాస్త అవగాహన ఉన్న ప్రతి క్రికెట్ అభిమాని.. కూడా సెమీస్‌లో ఇంగ్లండ్ ఈజీగా గెలుస్తుందని, ఫైనల్లో ఆసీస్-ఇంగ్లండ్ తలపడతాయని అనుకుని ఉంటారు. ఎందుకంటే సౌతాఫ్రికా నాకౌట్ ఫీవర్ గురించి వారికి తెలుసుకనుక.
కానీ.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. సౌతాఫ్రికా సెమీస్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి, తొలి సారి ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరింది. ప్రపంచ క్రికెట్‌లో పెద్ద జట్లలో ఒకటిగా పిలవబడే సౌతాఫ్రికా(మెన్స్, ఉమెన్స్)కు ఒక్కటంటే ఒక్క వరల్డ్ కప్ కూడా లేదు. 2014లో మాత్రం మార్కరమ్ కెప్టెన్సీలో అండర్ 19 వరల్డ్ కప్ గెలిచింది అంతే. ఆ ఒక్కటి మినహా ఇస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌లో సౌతాఫ్రికా జట్టుకు వరల్డ్ కప్ లేదు. అయితే.. ఇప్పుడు ఆ లోటును ఉమెన్స్ టీమ్ తీర్చాలని, తీరుస్తుందని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. ఆసీస్‌తో ఆదివారం జరిగే ఫైనల్లో గెలిచి.. వరల్డ్ కప్ గెలవలేని సౌతాఫ్రికా దరిద్రానికి అమ్మాయిలే చరమగీతం పాడాలని సౌతాఫ్రికా క్రికెట్ ఫ్యాన్సే కాకుండా ఇండియన్ ఫ్యాన్స్ కూడా ఆకాంక్షిస్తున్నారు. మరి సౌతాఫ్రికా తలరాతను అమ్మాయిలు మారుస్తారిన మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
SOUTH AFRICA WOMEN’S CRICKET MADE IT🙌😤💯
They are in the finals of the Women’s T20 WorldCup 2023 #ENGvSA | #T20WorldCup | #TurnItUp pic.twitter.com/zv3wgxNT9F
— Click Media Sport (@clickmediasport) February 24, 2023
What a feeling for South Africa 🇿🇦#ENGvSA | #T20WorldCup | #TurnItUp pic.twitter.com/GW8y1tdvAv
— ICC (@ICC) February 24, 2023
Phenomenal Proteas! 👏 👏
History in Cape Town as South Africa go through to the final of the Women’s #T20WorldCup 🙌#ENGvSA | #TurnItUp pic.twitter.com/hqlNuRmims
— ICC (@ICC) February 24, 2023