SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Why Sourav Ganguly Biopic Getting So Dealing

ధోని బయోపిక్ కన్నా.. 10 రెట్లు పవర్ ఉండే గంగూలీ బయోపిక్ ఎందుకు రావడం లేదు?

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Thu - 1 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ధోని బయోపిక్ కన్నా.. 10 రెట్లు పవర్ ఉండే గంగూలీ బయోపిక్ ఎందుకు రావడం లేదు?

మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో ఇండియన్‌ క్రికెట్‌ ప్రతిష్ట దిగజారి, జట్టు మానసికంగా కుంగిపోయి.. ఆట అటకెక్కిన సమయంలో భారత జట్టు కెప్టెన్‌గా పగ్గాలు అందుకున్నాడు. జట్టులోని సీనియర్లను కలుపుకుపోతూనే.. యువ క్రికెటర్లతో జట్టును నింపేశాడు. మట్టిలోని మాణిక్యాలను వెతికిమరీ పట్టుకుని టీమ్‌లోకి తెచ్చాడు. ఏ ఆటగాడిలో ఏ టాలెంట్‌ దాగి ఉందో కనిపెట్టి.. డాషింగ్‌ ఓపెనర్లను, మెరికల్లాంటి బౌలర్లను, మ్యాచ్‌ విన్నింగ్‌ ఆల్‌రౌండర్లను జట్టుకు అందించాడు. ఆస్ట్రేలియా అంటే భయపడే రోజుల్లోనే వారితో ఓ ఆటాడుకున్నాడు. స్వదేశంలోనే కాదు.. విదేశాల్లోనే భారత జట్టు పులే అని చాటిచెప్పాడు. క్రికెట్‌ పుట్టిన గడ్డ.. క్రికెట్‌ మక్కా లార్డ్స్‌లో చొక్కా విప్పి సింహ గర్జన చేశాడు. ముఖ్యంగా భయం తెలియని భారత జట్టును నిర్మించాడు.. అతనే సౌరవ్‌ గంగూలీ అలియాస్‌ ఇండియన్‌ క్రికెట్‌కు దాదా.

ఇలా ఇండియన్‌ క్రికెట్‌కు ఎంతో చేసిన దాదా జీవితంలో పెళ్లి కాకముందే ప్రేమ, కెప్టెన్‌గా ఉన్న సమయంలో కోచ్‌ చాపెల్‌తో గొడవ, కెప్టెన్సీ నుంచి తొలగింపు, జట్టు నుంచి ఉద్వాసన.. ఆ తర్వాత మళ్లీ జట్టులోకి ఒక వారియర్‌లా రీఎంట్రీ, ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ప్లేయర్‌గా అవమానం.. మళ్లీ ఐపీఎల్‌లోకి ఎంట్రీ.. ఆ తర్వాత ఆటకు గుడ్‌బై. కొన్ని రోజులకు బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రెసిండెండ్‌.. ఆ తర్వాత బీసీసీఐ ప్రెసిడెంట్‌, కరోనా సమయంలో ఐపీఎల్‌ నిర్వాహణ, తర్వాత బీసీసీఐ నుంచి బలవంతంగా బయటికి రావడం ఇలా.. ఎన్నో అవమానాలు, అద్భుత విజయాలతో గంగూలీ జీవితం ముడిపడి ఉంది. తీస్తే బాహుబలిని మించిపోయే సినిమా అవుతుంది. 100 కేజీఎఫ్‌లకు సమానమైన ఎలివేషన్లు ఉంటాయి.

 

why-sourav-ganguly-biopic-getting-so-dealing

టెస్టుల్లో ఏడో ర్యాంక్‌లో ఉన్న టీమిండియాను పటిష్టం చేయడం, ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవాను టాస్‌ కోసం వేచి ఉండేలా చేయడం, క్రికెట్‌కు పుట్టినిళ్లైన లార్డ్స్‌లో షర్ట్‌ విప్పి సింహంలా గర్జించడం, ఇండియన్‌ క్రికెట్‌ తలరాతను మార్చిన కల్‌కత్తా టెస్టుకు ప్రతినిధిగా నిలవడం, పాకిస్థాన్‌కు వెళ్లి మొట్టమొదటి సారిగా టెస్టు, వన్డే సిరీస్‌లు గెలవడం, సెహ్వాగ్‌, హర్భజన్‌ సింగ్‌, జహీర్‌ ఖాన్‌, యువరాజ్‌ సింగ్‌, ధోని, కైఫ్‌ లాంటి అద్భుత ఆటగాళ్లను జాతీయ జట్టుకు పరిచయం చేయడం.. ఇలా ఒక్కటేంటి? చెప్పుకుంటూ పోతే.. గంగూలీ సృష్టించిన చరిత్రకి అంతే ఉండదు. ఇన్ని అంశాలు ఉన్నా.. గంగూలీ బయోపిక్‌ ఎందుకు తెరకెక్కడం లేదన్నది అభిమానులను వేదిస్తున్న ప్రశ్న.

ఇప్పటికే టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని, దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ జీవితాల గురించి బయోపిక్‌ రూపంలో సినిమాలు వచ్చాయి. అలాగే 1983 వరల్డ్‌ కప్‌పై కూడా సినిమా వచ్చింది. తాజాగా ఇండియన్‌ ఉమెన్స్‌ టీమ్‌ మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ బయోపిక్‌ వచ్చింది. అలాగే మరో మాజీ క్రికెటర్‌ ఝూలన్‌ గోస్వామి జీవితం ఆధారంగా కూడా బయోపిక్‌ రానుంది. ఇలా ప్రముఖ క్రికెటర్ల జీవితాలపై బయోపిక్‌లు వస్తుంటే.. అదిరిపోయే ట్విస్ట్‌లు, కావాల్సినన్ని ఎలిమెంట్లు, ఎమోషన్స్‌ ఉన్న గంగూలీ జీవితం గురించి మాత్రం సినిమా రావడం లేదని క్రికెట్‌ అభిమానులు ఆవేదన చెందుతున్నారు. కాగా.. 2021లో గంగూలీ బయోపిక్‌ వస్తుందని వార్తలు వచ్చాయి. దానికి గంగూలీ సైతం స్పందించి బయోపిక్‌ తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు ప్రకటించాడు.

why-sourav-ganguly-biopic-getting-so-dealing

పైగా సినిమా పేరు ‘దాదా’ అని ప్రచారం కూడా జరగడంతో క్రికెట్‌ అభిమానులు ఫుల్‌ ఖుష్‌ అయ్యారు. కానీ ఏడాది దాటినా మరో అప్‌డేట్‌ లేకపోవడంపై అభిమానులు నిరాశచెందుతున్నారు. అసలు ఇంతకీ గంగూలీ బయోపిక్‌ ఉంటుందా? లేదా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. సుపర్‌స్టార్‌ రజనీ కాంత్‌ కుమార్తె ఐశ్వర్య రజనీ కాంత్‌ గంగూలీని బయోపిక్‌ను తెరకెక్కిస్తారనే ప్రచారం జరిగింది. కానీ.. అది నిజం కాదని తర్వాత తెలిసింది. ఇక ఆ తర్వాత.. బాలీవుడ్‌ ప్రముఖ డైరెక్టర్‌ శ్రీజిత్ ముఖర్జీ తనతో తన బయోపిక్‌ గురించి చర్చలు జరిపారని గంగూలీ స్వయంగా ప్రకటించడంతో శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో దాదా మూవీ తెరకెక్కుతుందని అంతా భావించారు.

కానీ.. 2021లో శ్రీజిత్‌ ముఖర్జీ.. గంగూలీని కలిసి బయోపిక్‌పై చర్చలు జరిపిన సమయంలో దాదా బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఉండటంతో.. స్క్రిప్ట్‌ వర్క్‌లో పాల్గొనేంత టైమ్‌ లేకపోవడంతో ముఖర్జీ ప్రాజెక్ట్‌ పట్టాలు ఎక్కలేదు. ఆ తర్వాత శ్రీజిత్‌ ముఖర్జీ మిథాలీ రాజ్‌ బయోపిక్‌ ‘శభాష్‌ మిథూ’ అనే సినిమా తీశారు. కానీ అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో దాదా బయోపిక్‌ను అతను హ్యాండిల్‌ చేస్తాడో లేదో అనుమానులు సైతం తలెత్తాయి. గంగూలీ కూడా ముఖర్జీతో తన బయోపిక్‌ తీసేందుకు సిద్ధంగా లేడన్నట్లు సమాచారం.

why-sourav-ganguly-biopic-getting-so-dealing

అలాగే ఎస్‌యూవీ సంస్థ కూడా గంగూలీ బయోపిక్‌ ‘దాదా’ను నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. కానీ.. గంగూలీ క్యారెక్టర్‌ కోసం ఏ హీరోను తీసుకుంటారో అనే విషయంపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. దాదా రోల్‌ కోసం హృతిక్‌ రోషన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, సిద్దార్థ్‌ మల్హోత్రా పేర్లు కూడా వినిపించాయి. కానీ.. స్పష్టమైన సమాచారం అయితే లేదు. కాగా.. ఇటివల బీసీసీఐ ప్రెసిడెంట్‌ పదవీకాలం ముగియడంతో ఖాళీగా ఉన్న గంగూలీని ఎవరైనా డైరెక్టర్‌ కలిసి.. బయోపిక్‌పై చర్చలు జరిపితే.. దాదా ప్రాజెక్ట్‌ పట్టాలెక్కె అవకాశం ఉంది. మరీ అభిమానులు ‘దాదా’ను తెరపై ఎప్పుడు చూస్తారో చూడాలి.

Sourav Ganguly has agreed for a Biopic 🤩, and Ranbir Kapoor might play the role of Dada.🥳#SouravGanguly #Biopic pic.twitter.com/BroAdhVbGN

— Sportskeeda (@Sportskeeda) July 13, 2021

Salman khan to act in Sourav Ganguly biopic. pic.twitter.com/dLncU8sO5j

— Bhuwantastic (@Bhuwantastic) September 9, 2021

A biopic is being produced on the legendary former Indian skipper, Sourav Ganguly 🙌

Which actor would you love to see in his role? 🤔#souravganguly #teamindia #india pic.twitter.com/Jt2njnav6B

— Sportskeeda (@Sportskeeda) September 9, 2021

Tags :

  • Cricket News
  • dada
  • Ranbir Kapoor
  • Sourav Ganguly
  • SumanTV Cricket Special
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam