మినీ ప్రపంచ కప్ రేంజ్లో జరిగే ఆసియా కప్ ప్రారంభానికి టైమ్ దగ్గర పడుతోంది. ఈ నెల 27న శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. ఆ మరుసటి రోజే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరుగనుంది. ఈ క్రేజీ మ్యాచ్‌తో పాటు ఆసియా విజేత ఎవరనే విషయంపై చాలా మంది చాలా రకాల అభిప్రాయాలు, విశ్లేషణలు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ సైతం ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ విజయావకాశాలపై స్పందించాడు.
ఆసియా కప్ బరిలో టీమిండియా కచ్చితంగా హాట్ ఫేవరేట్ అని.. అందులో సందేహం లేదని అన్నాడు. అయినా కప్ గెలవకపోవడానికి వారికేమైనా మిటమిన్ సీ తక్కువగా ఉందా?(నవ్వుతూ) అని అన్నాడు. అలాగే టీమిండియాలో మంచి టాలెంటెడ్ క్రికెటర్లు ఉన్నారు. కొంతకాలం వారు ఆడుతున్న తీరు చూస్తే ఎవరికైనా ఈ విషయం అర్థం అవుతుందని.. కానీ పాకిస్థాన్ టీమ్ తమదైన రోజున ఏ జట్టునైనా ఓడించగలదని సల్మాన్ బట్ ధీమా వ్యక్తం చేశాడు. దీంతో 28న భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే హైఓల్టెజ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలుస్తుందని సల్మాన్ చెప్పకనే చెప్పాడు.
కాగా ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఎప్పుడూ పైచేయి సాధిస్తుంది. కానీ.. గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ పాకిస్తాన్ చేతిలో భారత్ ఓటమి చవిచూసింది. ఈ గెలుపుతో వచ్చిన అతివిశ్వాసంతో పాక్ మాజీలు ఇలా వ్యాఖ్యలు చేస్తున్నట్లు క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. ఒక వైపు టీమిండియా హాట్ ఫేవరేట్ అని చెప్తూనే మరో వైపు పాకిస్థాన్ గెలుస్తుందంటూ రెండో నాలుకల ధోరణి అవలంభిస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి సల్మాన్ బట్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ‘1929’: వైరల్ గా మారిన ధోనీ రిటైర్మెంట్ టైం.. ICC ఏం చేసిందంటే?