క్రికెట్ వరల్డ్ వైడ్ గా గుర్తింపు ఉన్న క్రీడ. సాకర్ తర్వాత మళ్లీ అంతటి క్రేజ్ ఉన్న ఆట ఏదైనా ఉంది అంటే.. అది క్రికెట్ అనే చెప్పాలి. మరి అంతటి గొప్ప క్రీడలో రాణించాలి అంటే ఎంత కష్ట పడాలి. అదీకాక దేశం తరపున ఆడటం ఓ గౌరవం కూడా. మరి ఇంతటి గొప్ప గౌరవాన్ని పోగొట్టుకోవాలని ఏ ఆటగాడు కూడా అనుకోడు. కానీ తాజాగా టీమిండియాలోని ఓ ఆటగాడు మాత్రం తాను చేస్తున్న తప్పు కారణంగానే భవిష్యత్ ను అంధకారంలోకి నెట్టుకుంటున్నాడని క్రీడా విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. మరి ఆ తప్పు చేస్తున్న ఆటగాడు మరెవరో కాదు టీమిండియా మిస్టర్ 360 గా పేరొందిన సూర్యకుమార్ యాదవ్. క్రీజ్ లోకి అడుగుపెట్టడమే మెుదలు బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు సూర్య భాయ్. అదీకాక ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు సూర్య కుమార్. మరి అలాంటి ఆటగాడు చేస్తున్న తప్పు ఏంటి? అది అతడికి భవిష్యత్ లో శాపంగా మారబోతుందా? అన్న ప్రశ్నల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్య కుమార్ యాదవ్.. 2022 వరల్డ్ క్రికెట్ లో మారుమ్రోగిన పేరు. మరే ఇతర ఆటగాడి పేరుకూడా ఇంతలా క్రికెట్ లో వినిపించలేదు అంటే అతిశయోక్తికాదు. అంతలా సూర్య పేరు వరల్డ్ వైడ్ గా ప్రతిధ్వనించింది. ఇక సూర్య ఆడిన షాట్స్ చూసి.. క్రికెట్ లోకి ఓ గ్రహాంతర వాసి వచ్చాడా ఏంటి? అన్న సందేహాన్ని వెళ్లిబుచ్చారు క్రికెట్ దిగ్గజాలు. మరి అలాంటి క్రికెటర్ కు భవిష్యత్ తో అవరోధాలు ఎదురవుతాయి అంటున్నారు క్రీడా నిపుణులు. అవును వారు అంటున్న మాటలు నిజమే.. ఎందుకంటే? వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల్లో రాణించాలి అంటే, జట్టులో స్థానం సంపాదించాలి అంటే బ్యాటింగ్ తో పాటుగా బౌలింగ్ లో కూడా సత్తా చాటాల్సి ఉంటుంది. ప్రస్తుతం SKY బ్యాటింగ్ లో అదరగొడుతున్నప్పటికీ.. సూర్య బౌలింగ్ చేయలేకపోవడం అతడికి మైనస్ గా మారుతోంది.
గతంలో ఉన్న టీమిండియా ప్లేయర్స్ ను తీసుకుంటే.. సచిన్, సెహ్వాగ్, గంగూలీ ఆఖరికి ద్రవిడ్ లు సైతం అటు బ్యాటింగ్ లోనూ, ఇటు బౌలింగ్ లోనూ రాణించారు. ఇలా ఓ ఆటగాడు ఆల్ రౌండర్ గా జట్టులో రాణించినప్పుడే జట్టులో అతడి స్థానం సుస్థిరం అవుతుంది. అయితే సూర్య కుమార్ కు బౌలింగ్ రాదు అని కాదు. అతడు గతంలో చాలా సందర్భాల్లో అంటే ఫస్ట్ క్లాస్, నేషనల్ క్రికెట్ మ్యాచ్ ల్లో సూర్య బౌలింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి సూర్య కు బౌలింగ్ నైపుణ్యం ఉన్నప్పటికీ దాన్ని అతడు ఎందుకు పరిగణంలోకి తీసుకోట్లేదు అన్నదే ఇక్కడ అసలైన ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు చెప్పాల్సింది సూర్య ఒక్కడే. ఇకపోతే వచ్చే వరల్డ్ కప్ లో సూర్య ఇతర యంగ్ ప్లేయర్స్ నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొనక తప్పదు. ఇక సీనియర్ ప్లేయర్ అయిన రాహుల్ నుంచి కూడా అతడి స్థానాని ఎసరు ఉంది.
Suryakumar Yadav’s maiden hundred was full of class – the best! pic.twitter.com/3Fci70A4UF
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 31, 2022
ఈ క్రమంలోనే జట్టులో రాహుల్, విరాట్, అయ్యర్, పంత్, శుభ్ మన్ గిల్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ లాంటి ఆటగాళ్లతో టీమిండియా జట్టు నిండి ఉంది. ప్రస్తుతానికి అయితే జట్టులో సూర్య స్థానానికి ఎలాంటి డోకా లేదు. కానీ భవిష్యత్ లో ఇలాగే కొనసాగితే కచ్చితంగా సూర్య స్థానానికి గండి పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల్లో ఆల్ రౌండర్సే కీలకంగా మారుతారు అనడానికి 2011 ప్రపంచ కప్ హీరో యువరాజే ఒక నిదర్శనం. మరి ఇంతటి కీలకమైన ఆల్ రౌండర్ గా మారితేనే భవిష్యత్ లో టీమిండియాకి గొప్ప ప్లేయర్ గా సూర్య మారుతాడు. ఇక సూర్య చేత బౌలింగ్ వేయడం గురించి బీసీసీఐ కూడా ఓ సారి ఆలోచిస్తే మంచిది అని సగటు క్రీడాభిమానులతో పాటుగా దిగ్గజాలు చెబుతున్నారు. అయితే అందరి కంటే ఎక్కువగా బౌలింగ్ పై దృష్టి పెట్టాల్సిన అవసరం సూర్యకే ఉంది.. ఎందుకంటే ఎవరి జీవితాన్ని వారే సరిదిద్దుకోవాలి కనుక.
Here is our #TeamIndia‘s predicted 20 players for the #WorldCup2023.
Any changes?#BCCI #RohitSharma #ViratKohli #SuryakumarYadav #JaspritBumrah pic.twitter.com/M0R4HRQO6q
— CricTracker (@Cricketracker) January 2, 2023