భారత్-వెస్టిండీస్ మధ్య ఆదివారం నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. దీని కోసం విండీస్ ఆటగాళ్లు రెండు రోజుల క్రితమే అహ్మాదాబాద్‌కు చేరుకున్నారు. కాగా మూడు వన్డేలు కూడా అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్నాయి. స్టేడియంలో ప్రాక్టీస్ మొదలుపెట్టిన విండీస్ ఆటగాళ్లకు ఈ స్టేడియం బాగా నచ్చింది. అందులోని సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోతున్నారు. మోడీ స్టేడియం అద్భుతంగా ఉందని కొనియాడుతున్నాడు. విండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్ తన ట్విట్టర్ అకౌంట్‌లో ‘నరేంద్ర మోదీ స్టేడియం, వాటే బ్యూటిఫుల్ స్టేడియం’ అని పోస్టు పెట్టాడు.
Narendra modi stadium, what a beautiful stadium ! pic.twitter.com/MqINcAAhmE
— NickyP (@nicholas_47) February 4, 2022
కాగా ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఈ మోడీ స్టేడియం. గతంలో ఈ స్టేడియానికి మొతేరా సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంగా పేరు ఉండేది. దాన్ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం.. 2021 ఫిబ్రవరిలో నరేంద్రమోదీ స్టేడియంగా పేరు మార్చారు. లక్షా పదివేల సిట్టింగ్ సామర్థ్యం ఈ స్టేడియం సొంతం. మరి విండీస్ ఆటగాళ్లు మోడీ స్టేడియంపై మనసు పారేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.