తన అవసరం ఉన్నప్పుడు నాయకుడు అనే వాడు నిలబడతాడు. జట్టును ముందుండి నడిపిస్తాడు. జట్టులో సభ్యులు ఎంత మంది ఉన్నా నాయకుడు ఒక్కడే ఉంటాడు. ఏదో ప్రత్యేకత ఉంటేనే అతను నాయకుడు అవుతాడు. అలాంటి నాయకత్వ పటిమను, ప్రతిభను ప్రదర్శించాడు.. వెస్టిండీస్ కెప్టెన్ క్రైగ్ బ్రాత్ వైట్. కెప్టెన్ గా తానేంటో నిరూపించుకున్నాడు. 710 నిమిషాల పాటు క్రీజులో నిలబడి మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. తన ఆటతో వెస్టిండీస్ కు చెందిన దిగ్గజాల సరసన చేరాడు.
ఇదీ చదవండి: టీమిండియా వరల్డ్ కప్ సెమీస్ ఆశలు సంక్లిష్టం
అభిమానులు అందరూ పొట్టి క్రికెట్ పై మోజు పెంచుకుంటున్న వేళ విండీస్ కెప్టెన్ మళ్లీ అందరినీ సాంప్రదాయ క్రికెట్ వైపు చూసేలా చేశాడు. తన మారథాన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. 710 నిమిషాలు దాదాపు 12 గంటలపాటు క్రీజులో గడిపి 489 బంతులు ఎదుర్కొన్నాడు. 17 ఫోర్ల సాయంతో 160 పరుగులు చేశాడు. గతంలో టెస్టు క్రికెట్ తరఫున బ్రియన్ లారా, రామ్ నరేశ్ శర్వాన, వోరెల్ లు మారథాన్ ఇన్నింగ్స్ ఆడారు. ఇప్పుడు వారి సరసన బ్రాత్ వైట్ చేరాడు. అయితే బ్రియన్ లారా ఈ ఫీట్ ను రెండుసార్లు చేసి చూపించాడు.1994లో ఇంగ్లాండ్ దాదాపు 766 నిమిషాలు క్రీజులో గడిపి.. 375 పరుగులు చేశాడు. మళ్లీ 2004లో ఇంగ్లాండ్ పైనే 778 నిమిషాలు క్రీజులో ఉన్నాడు. అప్పుడు 400(క్వాడప్రుల్ సెంచరీ) పరుగులు నాటౌట్ చారిత్రక ఇన్నింగ్స్ ఆడాడు. బ్రియాన్ లారా తర్వాత 2009 ఇదే బ్రిడ్జ్ టౌన్ లో ఆర్‌ఆర్ శార్వన్ దాదాపు 698 నిమిషాలు క్రీజులో ఉండి.. 291 పరుగులు చేశాడు. 1960లో వోర్రెల్ 682 నిమిషాలు క్రీజులో గడిపి.. 197 నాటౌట్ గా నిలిచాడు. ప్రస్తుతం 710 నిమిషాలతో బ్రాత్ వైట్ మారథాన్ ఇన్నింగ్స్ పరంగా మూడో స్థానంలో, ఆటగాడిగా రెండోవాడిగా నిలిచాడు. పరుగుల పరంగా తక్కువ స్కోరే అయినా కూడా ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని బ్రాత్ వైట్ రికార్డుల కెక్కాడు.
ఇదీ చదవండి: శ్రీలంక వేదికగా భారత్- పాక్ మ్యాచ్.. ఎప్పుడంటే..?
మ్యాచ్ విషయానికి వస్తే.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 40 పరుగులు చేసింది. ఒక వికెట్ కూడా నష్టపోలేదు. జాక్ క్రాలీ(21), అలెక్స్ లీన్(18) క్రీజులో ఉన్నారు. నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ ప్రస్తుతం 136 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. బ్రాత్ వైట్ మారథాన్ ఇన్నింగ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
150* up for Captain @K_Brathwaite 👏🏾👏🏾. Bat on Skip! 🌴🏏#WIvENG #MenInMaroon pic.twitter.com/Zzr88snbwH
— Windies Cricket (@windiescricket) March 19, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.