క్రికెట్ అంటేనే అనిశ్చితికి మారుపేరు.. అందుకే ఈ ఆటకు అంతటి క్రేజ్. ఇవాళ అదరగొట్టిన జట్టే.. మరుసటి మ్యాచ్‌లో బోల్తాకొట్టొచ్చు. ఈ రోజు సెంచరీ చేసిన బ్యాటర్.. మరుసటి మ్యాచ్‌లో గ్లోడెన్ డక్‌గా అవుట్ అవ్వచ్చు. ఇలా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టే ఈ ఆటకు అంతమంది అభిమానులు ఉన్నారు. ఈ విషయం అంతగా అవగతం చేసుకోని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాగ్ టీమిండియాను హేళన చేశారు. 2019 జనవరిలో న్యూజిలాండ్-భారత్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా కేవలం 92 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌ను న్యూజిలాండ్ సునాయసంగా గెలిచింది. ఆ సందర్భంగా.. మైఖేల్ వాగ్ స్పందిస్తూ.. ఈ రోజుల్లో కూడా ఎవరైనా 100 పరుగులకు ఆలౌట్ అవుతారా? అని ట్విట్టర్‌లో టీమిండియా గురించి హేళనగా పోస్టు చేశారు.
England 68 all out @MichaelVaughan 🙈 #Ashes pic.twitter.com/lctSBLOsZK
— Wasim Jaffer (@WasimJaffer14) December 28, 2021
ఇప్పుడు ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో భాగంగా మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 68 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో.. అప్పటి వాగ్ ట్విట్టర్ పోస్టును పోస్టు చేశారు.. టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్. దాంతో వాగ్‌కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చినట్లు అయింది. వసీం జాఫర్ ట్వీట్‌కు వాగ్‌కు స్పందించారు. వెరీ గుడ్ వసీం అని నవ్వుతూ.. రీట్విట్ చేశారు. మరి మూడేళ్ల క్రితం వాగ్ చేసిన హేళనను గుర్తుపెట్టుకుని మరీ వసీం జాఫర్ ఇచ్చిన కౌంటర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Very good Wasim 😜😜😜 https://t.co/OemxRrG2IF
— Michael Vaughan (@MichaelVaughan) December 28, 2021