గత కొంతకాలంగా వరల్డ్ క్రికెట్ లో ప్రతిధ్వనిస్తున్న పేరు సూర్యకుమార్ యాదవ్. మరీ ముఖ్యంగా టీ20ల్లో సూర్య చెలరేగే తీరు అమోఘం. తన అద్భుతమైన ఫామ్ తో అటు టెస్టుల్లోకి, ఇటు వన్డేల్లోకి దూసుకొచ్చాడు ఈ మిస్టర్ 360 ప్లేయర్. అయితే టీ20ల్లో కనబరిచిన ఫామ్ ను వన్డేల్లో చూపించలేకపోతున్నాడు. వన్డేల్లో వరుసగా అవకాశాలు వస్తున్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేక పోతున్నాడు సూర్యకుమార్ యాదవ్. ఈ నేపథ్యంలోనే SKY వన్డేల్లో రాణించాలి అంటే.. తన ఆటలో అదొక్కటి మార్చుకోవాలని సూచించాడు టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్. టీ20ల్లో అద్భుతంగా రాణిస్తున్న సూర్య.. వన్డేల్లో సైతం గొప్పగా రాణించగలడని జాఫర్ పేర్కొన్నాడు.
సూర్యకుమార్ యాదవ్.. టీ20 ర్యాంకింగ్స్ లో వరల్డ్ నం.1 బ్యాటర్ గా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే వన్డేల్లో మాత్రం ఆ జోరును కొనసాగించలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే సూర్యకుమార్ కు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చాడు టీమిండియా మాజీ బ్యాటర్ వసీం జాఫర్. సూర్య కుమార్ వన్డే కెరీర్ గురించి తాజాగా మాట్లాడుతూ..”సూర్య అద్భుతమైన ఆటగాడు అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే అతడు టీ20 మ్యాచ్ లు ఎక్కువగా ఆడినందున దాని ప్రభావం తప్పకుండా అతడిపై ఉంటుంది. అదీకాక పొట్టి ఫార్మాట్ లో ఓవర్లు తక్కువగా ఉంటాయి కాబట్టి.. వీలైనంత స్పీడ్ గా పరుగులు రాబట్టాల్సి ఉంటుంది. అయితే వన్డేల్లో అలాకాదు. కావాల్సినంత టైమూ, ఓవర్లు కూడా ఉంటాయి. ఇది సూర్య కుమార్ అర్థం చేసుకోవాలి” అని జాఫర్ సూచించాడు.
ఇక SKY ఎక్కువగా వన్డే మ్యాచ్ లు ఆడాలి. అప్పుడే అతడికి వన్డే ఫార్మాట్ పై ఓ ఆలోచనకు వస్తాడని వసీం జాఫర్ తెలిపాడు. అదీకాక సూర్య కుమార్ 30 ఓవర్ల తర్వాత బ్యాటింగ్ కు దిగితే మంచిది అని జాఫర్ సలహా ఇచ్చాడు. సూర్య ఇదొక్కటి అలవాటు చేసుకుంటే.. వన్డేల్లో అతడు అద్భుతాలు సృష్టించగలడని పేర్కొన్నాడు. ఎక్కువ ఓవర్లు ఉండటంతో ప్లేయర్లు గందరగోళానికి గురౌతారని, దాన్ని సూర్య భాయ్ అధిగమిస్తే.. అతడికి వన్డేల్లో తిరుగుండదని ఈ సందర్భంగా జాఫర్ చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో 26 బంతుల్లో 31 పరుగులు చేసి త్వరగానే పెవిలియన్ కు చేరాడు. మరి సూర్యకుమార్ కు వసీం జాఫర్ ఇచ్చిన సలహాలు, సూచనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Suryakumar Yadav hasn’t played a lot of ODI cricket but he’ll get used to it, says Wasim Jaffer #INDvsNZ #suryakumar pic.twitter.com/EDe10oezT7
— Shahryar Khan (@ShareenKhaan) January 19, 2023