ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి ఎవరైనా రిటైర్ అయితే క్రేజ్ తగ్గుతుంది గాని ధోనీకి మాత్రం పెరుగుతూనే ఉంది. ఇదంతా తెలిసిందే అయినా క్రికెట్ లోకి రాకముందు ధోనీ గురించి కొన్ని నిజాలు ప్రస్తుతం ఆశ్చర్యకరంగా అనిపిస్తున్నాయి.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని క్రికెట్ ప్రస్తానం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఇండియన్ క్రికెట్ లో కెప్టెన్ గా, ఫినిషర్ గా, వికెట్ కీపర్ గా తనదైన ముద్ర వేసాడు. టీమిండియాకు ఒక్క ఐసీసీ ట్రోఫీ కరువైన నేపథ్యంలో ఏకంగా 6 ఏళ్ళ వ్యవధిలో మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు. వీటిలో టీ 20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ తో పాటుగా ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఉంది. ఇక బ్యాటర్ గా ఎన్నో మ్యాచులను గెలిపించాడు. ఇక మహేంద్రుడి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా తెలిసిందే అయినా క్రికెట్ లోకి రాకముందు ధోనీ గురించి కొన్ని నిజాలు ప్రస్తుతం ఆశ్చర్యకరంగా అనిపిస్తున్నాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి ఎవరైనా రిటైర్ అయితే క్రేజ్ తగ్గుతుంది గాని ధోనీకి మాత్రం పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది ఐపీఎల్ లో అభిమానులు ఓ రేంజ్ లో ధోని జపం చేసిన సంగతి తెలిసిందే. మిస్టర్ కూల్ మార్కెట్ కూడా అమాంన్తం పెరిగింది. మహేంద్ర సింగ్ ధోనీ ఆస్తుల విలువ 127 మిలియన్ డాలర్లు. అంటే భారత కరెన్సీలో 1040 కోట్ల రూపాయలు. కోహ్లీ, సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యధిక ఆస్తులు కలిగిన మూడో భారత క్రికెటర్‌గా మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నాడు. దాదాపు 44 బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఐపీఎల్ ద్వారా సంవత్సరానికి 12 కోట్లు సంపాదిస్తున్నాడు. అయితే ధోనీ ఒకానొక దశలో 30 లక్షలు సంపాదించి క్రికెట్ నుంచి వైదొలుగుతాను అని చెప్పాడట. ఈ విషయాన్ని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు.
జాఫర్ మాట్లాడుతూ.. “క్రికెట్ లోకి అడుగుపెట్టకముందు ధోనీ మా ఇంటికి వచ్చాడు. అప్పుడు నా భార్యతో “బాబీ.. నేను రూ.30 లక్షలు సంపాదించాలి. ఆ తర్వాత ఇక ఈ క్రికెట్ ని వదిలేస్తా అని చెప్పాడు. ఏది ఏమైనా నేను రాంఛీని మాత్రం వదిలి వెళ్లను”.’ అని చెప్పాడు. ఆ మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. ధోనీ చాలా చిన్న కలలు కంటాడు. వాటిని నిజం చేసుకుంటూ ముందుకు వెళ్తాడు. ధోనీ టార్గెట్స్ ఎప్పుడూ పెద్దగా ఉండవు. అందుకే అతని సక్సెస్ చాలా పెద్దగా ప్రపంచానికి వినిపించింది’’ అంటూ చెప్పుకొచ్చాడు వసీం జాఫర్. మొత్తానికి ధోనీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.