ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దానికి తోడు వరుసగా పాక్ జట్టు పరాజయాల పాలవుతుండటంతో.. జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు సైతం వస్తున్నాయి. బాబర్ ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని, బాబర్ తో వసీం అక్రమ్ కు విభేదాలు ఉన్నాయని గత కొంత కాలంగా పాక్ క్రికెట్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై తాజాగా స్పందించాడు పాక్ దిగ్గజ పేసర్ వసీం జాఫర్. ఏ పనీ లేని వెదవలే ఇలాంటి పుకార్లను పుట్టిస్తారని పాకిస్థాన్ స్పోర్ట్స్ జర్నలిస్టులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బాబర్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, అతడు నాకు కొడుకుతో సమానం అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు వసీం అక్రమ్.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో ప్రస్తుతం అనిశ్చితి నెలకొంది. గత కొన్ని రోజులుగా పాక్ క్రికెట్ బోర్డులో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కొన్నిరోజుల ముందే తాత్కాలిక ఛీప్ సెలక్టర్ గా ఉన్న అఫ్రీదిని తొలగించిన విషయం మనకు తెలిసిందే. ఇక తాజాగా పాక్ దిగ్గజ పేసర్ వసీం అక్రమ్ కు బాబర్ కు మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఈ విభేదాల కారణంగానే బాబర్ పాకిస్థాన్ సూపర్ లీగ్ లో కరాచీ కింగ్స్ ను వదిలి పెషావర్ జల్మి జట్టుకు మారాడని కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలను తాజాగా ఖండించారు అక్రమ్. నేను బాబర్ ఆటపై ఎప్పుడూ విమర్శలు చెయ్యలేదని వసీం అక్రమ్ అన్నాడు. కానీ కొంతమంది జర్నలిస్టులు ఇలాంటి స్టోరీలను వారే క్రియేట్ చేసి జనాల్లోకి వదులుతారు. వారికి 24/7 ట్వీట్టర్ లో ఇదే పని అని ఆగ్రహం వ్యక్తం చేశాడు వసీం అక్రమ్.
అయితే ఇలాంటి వారిని నేను నా లైఫ్ లో ఒక్కసారి కూడా కలవలేదని అన్నాడు. ఇక ఆటగాళ్లు ఫ్రాంఛైజీలు మారడం క్రికెట్ లో సాధారణమైన విషయమే. అది ఆ ఫ్రాంఛైజీ యాజామన్యం మీద ఆధారపడి ఉంటుంది. ఇదిలా ఉంటే బాబర్ తో నేను నిత్యం టచ్ లోనే ఉంటాను, అతడు నా కొడుకుతో సమానం. మా మధ్య విభేదాలు ఎందుకు ఉంటాయి? అని ప్రశ్నించాడు వసీం అక్రమ్. బాబర్ కు నా పూర్తి మద్ధతు ఉంటుంది అని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. మరి ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న బాబర్ ను వసీం అక్రమ్ వెనకేసుకు రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.