టీమిండియా ఆటగాడు వాషింగ్టన్ సుందర్ ప్రస్తుతం తనకు దొరికిన ఫ్రీ టైమ్‌ను అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నట్లు ఉన్నాడు. చిన్నతనంలో క్రికెట్ ఓనమాలు నేర్చుకున్న గల్లీ క్రికెట్‌ను మరోసారి టచ్ చేశాడు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకుంటూ గల్లీ కుర్రాళ్లతో కలిసి క్రికెట్ ఆడాడు. వాటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం సుందర్ గల్లీ క్రికెట్ ఆడుతున్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా వాషింగ్టన్ సుందర్ గల్లీ క్రికెట్ ఆడటంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. టీమిండియా క్రికెటర్‌ననే గర్వానికి పోకుండా.. ఎంతో సాధారణంగా పిల్లలు, కుర్రాళ్లతో కలిసి ఇంత సింపుల్‌గా ఉండడంపై ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్‌కు టీమిండియాలో స్థానం దక్కలేదు. ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన వాషింగ్టన్ సుందర్.. 9 మ్యాచ్‌ల్లో 101 పరుగులు చేసి 6 వికెట్లు పడగొట్టి పర్వాలేదనిపించాడు. మరి వాషింగ్టన్ సుందర్ గల్లీ క్రికెట్ ఆడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Gully Cricket with Gilli Boys! 🎾 pic.twitter.com/UAcWGHltZG
— Washington Sundar (@Sundarwashi5) July 1, 2022