‘కొడుకు పుట్టిన సంతోషాన్ని నలుగురితో పంచుకోవాలి’ అనుకునే ఒక తండ్రితో.. ‘తండ్రికి నిజమైన పుత్రోత్సాహం కొడుకు పుట్టినప్పుడు కాదు.. ఆ కొడుకు సంస్కారవంతుడిగా ఎదిగి, అందరూ అతణ్ని పొగుడుతున్నప్పుడు కలుగుతుంది..’ అని సుమతీ శతకం చెబుతుంది. కుమారులు ఆదర్శ పుత్రులుగా నడుచుకుని తల్లిదండ్రులకు, వంశానికి కూడా పేరుతెచ్చినప్పుడు ఈ సందేశాన్ని వాడుతుంటాం. ఇప్పుడు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కు ఈ సుమతీ శతకం కరెక్టుగా సరిపోతుంది. ఎందుకంటే.. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ ఢిల్లీ జట్టుకు ఎంపికయ్యాడు.
Delhi Men’s under 16 Team for the match against Bihar in the Vijay Merchant Trophy. Delhi won the toss and elected to bat first. pic.twitter.com/KcwMwSS4yw
— DDCA (@delhi_cricket) December 6, 2022
ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) విజయ్ మర్చంట్ ట్రోఫీలో భాగంగా బీహార్‌తో జరగబోయే మ్యాచ్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. అందులో వీరేంద్ర సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ చోటుదక్కించుకున్నాడు. DDCA సోషల్ మీడియాలో షేర్ చేసిన టీమ్ షీట్‌లో, ఆర్యవీర్ పేరు జట్టులోని 15వ సభ్యుడిగా కనిపించింది. అంటే.. అతడు తుది జట్టులో భాగం కాకపోవచ్చు కానీ, రిజర్వు ప్లేయర్ గా ఎంపిక చేసింది. కాగా, ఆర్యవీర్.. తండ్రిలాగానే రైట్ హ్యాండ్ బ్యాటర్. తండ్రిగా సెహ్వాగ్ ఇది ఆనందించాల్సిన సందర్భం అయినప్పటకీ.. కొందరు దీన్ని ‘నెపోటిజం..’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం టీమ్ షీట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
The 15th name is interesting Aryavir Sehwag https://t.co/has4rMxmzr
— Kushan Sarkar (@kushansarkar) December 6, 2022
Nepotism in cricket too
— Aman 🇮🇳 (@criccrazy1307) December 6, 2022
Like father, like son! Aryaveer Virender Sehwag is all set to make everyone a fan of his swagger! Watch him on #SuperSonday, on Star Sports. pic.twitter.com/4PQdMBa43L
— Star Sports (@StarSportsIndia) June 9, 2017