స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన 'నెక్ట్స్ సూపర్ స్టార్' అనే షోలో హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్ లు పాల్గొన్నారు. ఈ చర్చలో బజ్జీపై తనదైన స్టైల్లో సెటైర్స్ వేశాడు డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్.
ప్రస్తుతం టీమిండియా జట్టు అద్భుతమైన ఆటగాళ్లతో నిండి ఉంది. దాంతో జట్టులో చోటు దక్కించుకోవడం కోసం ఆటగాళ్లు చాలా శ్రమించాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే భవిష్యత్ లో సత్తా చాటే ఆటగాళ్లు ఎవరు? అన్న చర్చలో పాల్గొన్నారు టీమిండియా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ లు. స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ‘నెక్ట్స్ సూపర్ స్టార్’ అనే షోలు వీరు పాల్గొన్నారు. ఈ షోలో బజ్జీ-వీరు మధ్య మాటల యుద్దం నడిచింది. ఆ ఆటగాడు పంజాబీ ప్లేయర్ కాబట్టి అతడి పేరును చెబుతున్నావా అంటూ ఈ షోలో బజ్జీపై సెటైర్స్ వేశాడు సెహ్వాగ్.
స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ‘నెక్ట్స్ సూపర్ స్టార్’ అనే షోలో హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్ లు పాల్గొన్నారు. ఈ చర్చలో తమ అభిప్రాయాలను వెల్లడించారు ఈ ముగ్గురు. ముందుగా ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ..”ఫాస్ట్ బౌలర్ల జాబితాలో రాబోయే 5 సంవత్సరాల్లో ఉమ్రాన్ మాలిక్ రాటుదేలుతాడు. ఇక స్పిన్నర్ల విషయానికి వస్తే.. వైవిధ్యాన్ని చాటుతున్న రవి బిష్ణోయ్ రాబోయే సూపర్ స్టార్” అని పఠాన్ అన్నాడు. అయితే బిష్ణోయ్ కు రావాల్సినంత పేరు మాత్రం రావడం లేదని చెప్పుకొచ్చాడు పఠాన్.
అనంతరం టీమిండియా టర్బోనేటర్ బజ్జీ మాట్లాడుతూ..” నా అభిప్రాయం ప్రకారం.. అర్షదీప్ సింగ్ సూపర్ స్టార్ గా ఎదగడం ఖాయం” అని బజ్జీ చెప్పగానే.. వెంటనే జోక్యం చేసుకున్నాడు సెహ్వాగ్. మరే బౌలర్ స్టార్ బౌలర్ గా ఎదగలేడా? పంజాబీ ప్లేయర్ కే ఆ అవకాశం ఉందా? ఫ్యూచర్ పంజాబ్ ప్లేయర్స్ దేనా? అంటూ వరుసగా సెటైరికల్ క్వశ్చన్స్ అడిగాడు. దానికి బజ్జీ సమాధానం ఇస్తూ..”అలాంటిది ఏం లేదు. మనం ఇక్కడ మాట్లాడుకునేది టాలెంట్ గురించి. ఇతర ప్రాంతాల ఆటగాళ్లు కూడా రాణిస్తున్నారు. అయితే అర్షదీప్ లో సూపర్ స్టార్ గా ఎదిగే సత్తా ఉంది అని చెబుతున్నా” అని బజ్జీ చెప్పుకొచ్చాడు. అయితే సెటైర్లు వేయడంలో సెహ్వాగ్ సిద్దహస్తుడు అని మనకు తెలిసిందే. మరోసారి తనలోని హాస్యచతురతను బయటపెట్టాడు ఈ డాషింగ్ బ్యాటర్.
Virendra Sehwag hilariously trolls Harbhajan Singh when chose to go with Arshdeep Singh | IPL | #IPL2023 | #harbhajansingh https://t.co/7laZlMcLGZ
— R.Sport (@republic_sports) February 26, 2023