టీమిండియా క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డపేరు మహేంద్ర సింగ్ ధోని. అవసాన దశలో ఉన్న టీమిండియాను ప్రపంచ మేటి జట్లలో ఒకటిగా నిలిపాడు ఈ మహేంద్రుడు. 1983 తర్వాత వరల్డ్ కప్ ముద్దాడాలనే సుదీర్ఘ నిరీక్షణకు 2011లో తెరదించాడు ధోని. అదీకాక 2007 టీ20 వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలను టీమిండియాకు అందించిన ఏకైక సారథిగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలోనే అన్ని ఫార్మాట్ ల నుంచి వైదొలిగి, ఒక్క ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ధోనికి ఫ్యాన్స్ మాత్రం తగ్గలేదు. తాజాగా ధోనిపై తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్నాడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. తన ఇన్ స్టా గ్రామ్ స్టోరిలో వాటర్ బాటిల్ పై ధోని పిక్ ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. అతడు అన్ని చోట్లా ఉంటాడు అనే క్యాప్షన్ ఇచ్చాడు.
సాధారణంగా క్రికెటర్లకు ఫ్యాన్స్ ఉండటం సహజమే. కానీ స్టార్ క్రికెటరే మరో క్రికెటర్ కు అభిమానిగా ఉండటం చాలా అరుదుగా జరిగే సంఘటనలు. సందర్భం వచ్చినప్పుడల్లా తమ అభిమాన క్రికెటర్ పై తన ప్రేమను వెల్లడిస్తుంటారు. ఈ క్రమంలోనే టీమిండియా స్టార్ కింగ్ విరాట్ కోహ్లీ.. ధోనిపై తనకున్న ప్రేమను మరోసారి నిరూపించుకున్నాడు. ధోని ఫొటోను ఓ వాటర్ బాటిల్ సంస్థ తమ బాటిల్లపై ముద్రించింది. దాంతో ఈ బాటిల్ పై ఉన్న ధోని పిక్ ను తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు కోహ్లీ. పైగా అతడు అన్ని చోట్లా ఉంటాడు.. కేవలం వాటర్ అనే కాదు భూమీ, ఆకాశం ఇలా అన్ని చోట్లా ఉంటాడని, అతడి క్రేజ్ ఎవ్వరికీ సాధ్యం కాదు అని విరాట్ పేర్కొన్నాడు.
ప్రస్తుతం విరాట్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ధోని రిటైర్ అయ్యి దాదాపు 3 సంవత్సరాలు కావొస్తున్నాగానీ విరాట్ మాత్రం అతడిపై తనకున్న అభిమానాన్ని పలువిధాలుగా చాటుతూనే ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియా న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. కాగ సీనియర్ బ్యాట్స్ మెన్స్ అయిన విరాట్, రోహిత్, దినేష్ కార్తీక్, రాహుల్ కు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. దాంతో విరాట్ కోహ్లీ తన ఫ్యామిలీతో కలిసి ఉత్తరాఖండ్ లోని పలు పర్యటక ప్రదేశాలతో పాటుగా దేవాలయాలను సందర్శిస్తున్నాడు. అక్కడ అభిమానులతో పాటు దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. వెకేషన్ ను తెగ ఎంజాయ్ చేస్తున్నాడు విరాట్.
Virat Kohli’s Instagram story – the bond between him and MS Dhoni. ♥️ pic.twitter.com/edHdOgCNzm
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 21, 2022