కింగ్ కోహ్లీ.. ఒక పరుగుల యంత్రం. అతని బ్యాట్‌నుంచి పరుగులు ధారాళంగా వచ్చేస్తాయి. కోహ్లీ కవర్ డ్రైవ్ ఆడితే అడ్డుకోవడానికి రాళ్లతో గోడ కట్టుకోవాల్సిందే. ఎంతమంది ఫీల్డర్లు ఉన్నా వారి మధ్య నుంచి బంతిని బౌండరీకి తలించే సత్తా విరాట్ కోహ్లీ సొంతం. చూస్తూ ఉండగానే బౌండరీలతోనే హాఫ్ సెంచరీకి చేరిపోతాడు. టీ20ల్లో అత్యధిక ఫోర్టు కొట్టిన రికార్డు కోహ్లీ పేరునే ఉండేది. బట్ అది నిన్నటి వరకు. ఇప్పుడా రికార్డు ఒక పసికూన జట్టు సభ్యుడిది. ఐర్లాండ్ ఆటగాడు స్టిర్లింగ్ విరాట్ కోహ్లీని అధిగమిస్తూ టీ20ల్లో అత్యధిక ఫోర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు.
285 ఫోర్లతో టాప్‌లో ఉన్న కోహ్లీని అక్టోబర్ 10న యూఏఈతో జరిగిన టీ20 మ్యాచ్‌లో స్టిర్లింగ్ అధిగమించాడు. ఆ మ్యాచ్‌లో 4 ఫోర్లు కొట్టి 288 ఫోర్లతో టాప్‌లో నిలిచాడు. స్టిర్లింగ్ తర్వాత కోహ్లీ, న్యూజిలాండ్ ఆటగాడు గుప్టిల్ (256 ఫోర్లు) మూడో స్థానంలో, రోహిత్ శర్మ(252) ఫోర్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. కాగా అక్టోబర్ 17 నుంచి ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లతో కోహ్లీ మళ్లీ టాప్ ప్లేస్‌కు చేరుకుంటాడని విరాట్ ఫ్యాన్స్ భీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: తెలుగు వారితో ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్న కోహ్లీ.. కారణమేంటి?