టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరికొన్ని రోజుల్లో కెప్టెన్‌గా కాకుండా ఐపీఎల్ బరిలో దిగనున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ముందు దొరికిన ఈ కాస్త గ్యాప్‌లో సేదతీరుతున్నట్లు కనిపిస్తున్నాడు. తాజాగా విరాట్ కోహ్లీ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసిన ఫొటో చూస్తే అర్థం అవుతుంది అతను ఎంత రిలాక్స్ అవుతున్నాడు. పచ్చిక నేలపై పడుకున్న కోహ్లీ.. నేత తల్లి సంగీతం వింటున్న అని పేర్కొన్నాడు. ప్రస్తుతం కోహ్లీ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
సహజంగా ప్రకృతి ప్రేమికుడైన కోహ్లీ.. ప్రస్తుతం నేచర్‌కు మరింత దగ్గరవుతున్నాడని అతని ఫ్యాన్స్ అంటున్నారు. కాగా ఈ నెల 26న ప్రారంభ కానున్న ఐపీఎల్‌లో కోహ్లీ కేవలం ఒక ప్లేయర్‌గా మాత్రమే బరిలో దిగనున్నాడు. గతేడాది సీజన్ మధ్యలోనే ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు కోహ్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా ఆర్సీబీ కోహ్లీ స్థానంలో తన కెప్టెన్‌గా సౌతాఫ్రికా ప్లేయర్ డుప్లెసిస్‌ను ప్రకటించింది. మరి కోహ్లీ నేలపై పడుకున్న ఫొటోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కోహ్లీ కెప్టెన్‌గా లేకపోవడం వారికి ప్రమాదం: గ్లెన్ మ్యాక్స్‌వెల్
The Earth has music for those who listen. pic.twitter.com/dyeMuwTff6
— Virat Kohli (@imVkohli) March 19, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.