విరాట్ కోహ్లీ మ్యాచ్‌లో ఎంత అగ్రెసివ్‌గా ఉంటాడో.. బయట అంత సరదాగా ఉంటాడు. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరితో చాలా ప్రేమతో ఉంటాడు. ప్రాక్టీస్ సమయంలో అయితే ఫుల్ ఎనర్జీతో ఉంటూ.. యువ క్రికెటర్లను ఆటపట్టిస్తుంటాడు.
టీమిండియా మాజీ కెప్టెన్, రన్‌మెషీన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో రెండో టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 25 వేల పరుగుల మైలురాయిని అందుకుని మంచి జోష్‌లో అన్నాడు. అలాగే టీమిండియా కూడా ఆస్ట్రేలియాపై వరుసగా తొలి రెండు టెస్టుల్లో విజయం సాధించడంతో రెట్టించిన ఉత్సాహంతో మూడో టెస్టు కోసం ఎదురుచూస్తోంది. అందుకోసం ముమ్మరంగా ప్రాక్టీస్ కూడా చేస్తోంది. అలెడ్రీ రెండు టెస్టులు గెలిచామనే అహంకారం లేకుండా.. భారత ఆటగాళ్లు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆటగాళ్లు చాలా సరదాగా కూడా గడిపారు. జట్టులో సీనియర్లు, జూనియర్లు అనే బేషజాలకు పోకుండా అందరూ ఎంతో సరదాగా ఉన్నారు. అందుకు చక్కటి ఉదాహరణే.. విరాట్ కోహ్లీ-గిల్ మధ్య జరిగిన సంఘటన.
ప్రాక్టీస్ సమయంలో శుబ్‌మన్ గిల్, మొహమ్మద్ షమీ, సిరాజ్ ఒక చోట నిలబడి ఏదో మాట్లాడుకుంటుండగా.. అక్కడికి వచ్చిన కోహ్లీ గిల్‌ను కొట్టరాని చోట అలా మెల్లగా కొట్టడంతో వెంటనే గిల్ ఉలిక్కిపడతాడు. పక్కనున్న వాళ్లంత ఘొల్లున నవ్వుతారు. ఈ సరదా సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే.. కోహ్లీ-గిల్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. పైగా కోహ్లీ జట్టులోని ప్రతి ఆటగాడితో చాలా సరదాగా ఉంటాడు. సీనియర్ ప్లేయర్ అనే గర్వానికి పోకుండా.. ఎంతో ఒదిగి ఉంటాడు. యువ క్రికెటర్లతో సరదా సరదాగా ఉంటూ.. వారిని అనునిత్యం ప్రొత్సహిస్తూ ఉంటాడు. కోహ్లీలో గొప్ప లక్షణాల్లో ఇది కూడా ఒకటి.
ఇక ఇప్పటికే ఆస్ట్రేలియాపై రెండు టెస్టులు గెలిచిన భారత్.. మూడో టెస్టు కోసం ప్రిపేర్ అవుతంది. మిగిలిన రెండు టెస్టుల తర్వాత మూడు వన్డేలను సైతం భారత్, ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఈ రెండు టెస్టులు, మూడు వన్డేల సిరీస్ కోసం ఇప్పటికే బీసీసీఐ జట్లను కూడా ప్రకటించింది. తొలి రెండు టెస్టులు ఆడిన జట్టునే మిగిలిన రెండు టెస్టుల కోసం కూడా కొనసాగిచింది. జట్టులో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయలేదు. కేవలం ఫామ్‌లో లేని కేఎల్ రాహుల్‌ను టెస్టు టీమ్ వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించింది. కానీ.. ఆ బాధ్యతలను ఇంకా ఎవరికీ ఇవ్వలేదు. అలాగే తొలి వన్డేకు రోహిత్ శర్మ అందుబాటులో ఉండటం లేదనే విషయాన్ని వెల్లడించింది. మరి ఈ జట్లతో పాటు కోహ్లీ-గిల్ మధ్య జరిగిన సరదా ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virat and Gill Bond off the field 😂😂😂 #ViratKohli𓃵 #ViratKohli #INDvsAUS #AUSvsIND #INDvAUS pic.twitter.com/qpYw9fPr6w
— India Fantasy (@india_fantasy) February 19, 2023