విరాట్ కోహ్లీ టీమిండియా టెస్టు క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్. ఒక ఐసీసీ ట్రోఫీ మినహా భారత్‌కు ఎన్నో అరుదైన విజయాలను అందించాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో సిరీస్‌లు గెలిచి చరిత్ర సృష్టించాడు. తాజాగా దక్షిణాఫ్రికాలో కూడా టెస్టు సిరీస్ గెలిచే అవకాశం టీమిండియా ముందు ఉంది. మూడు టెస్టుల సిరీస్‌లో 1-1తో సమంగా ఉన్న ఇరుజట్లకు మంగళవారం నుంచి ప్రారంభం కానున్న చివరి టెస్టులో గెలిచిన జట్టు సిరీస్ విజేతగా నిలవనుంది. ఇప్పటి వరకు భారత్‌కు దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ విజయం లేదు.
ఇప్పుడు ఇదే విషయం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని బాగా ఊరిస్తుంది. ఎలాగైన చివరి టెస్టులో గెలిచి భారత్‌కు దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ విజయం లోటును తీర్చాలనుకుంటున్నాడు. తొలి టెస్టులో అద్భుతమైన విజయం సాధించిన భారత్.. రెండో టెస్టులో ఓడింది. కాగా పైవెన్ను నొప్పి కారణంగా రెండో టెస్టుకు విరాట్ కోహ్లీ దూరమైన విషయం తెలిసిందే. దీంతో కేఎల్ రాహుల్ రెండో టెస్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. రెండో టెస్టు చివరి రోజు భారత్ ఎటాకింగ్ కెప్టెన్సీ లోపం కారణంగానే ఓడిందనే విమర్శలు వచ్చాయి. కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా దూకుడు ప్రదర్శించలేకపోయాడనే వాదన కూడా వినిపించింది. ఈ టెస్టులో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉంటే టీమిండియా పరిస్థితి వేరేలా ఉండదని క్రికెట్ నిపుణులు భావించారు. విరాట్ కోహ్లీ బౌలర్లను ప్రయోగించే తీరు చాలా అగ్రెసివ్‌గా ఉంటుందని, ఆ తీరు ప్రత్యర్థిని ఇబ్బందికి గురిచేస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
It’s GO time here in Cape Town 👏 👏#TeamIndia all set and prepping for the series decider 👍 👍#SAvIND pic.twitter.com/RgPSPkNdk1
— BCCI (@BCCI) January 9, 2022
ఇక చివరిదైన మూడో టెస్టులో ఎలాగైన బరిలోకి దిగి టీమిండియాకు మరో అరుదైన సిరీస్ విజయం అందించాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకోసం తన గాయం పూర్తిగా నయం కాకుండానే.. దాన్ని లెక్క చేయకుండా మూడో టెస్టులో ఆడనున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంతో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. విరాట్ కెప్టెన్సీలో టీమిండియా చివరి టెస్టు కచ్చితంగా గెలుస్తుందని వారు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ గట్టి నమ్మకంపై, విరాట్ కోహ్లీ గాయాన్ని లెక్క చేయకుండా మూడో టెస్టుకు సిద్ధమవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కోహ్లీ కావాలనే టెస్ట్ మ్యాచ్ ఆడటంలేదా? నిరసన దేనికి!