ఆసియా కప్ 2022లో టీమిండియా మొదటి ఓటమిని చవిచూసింది. ఆసియా కప్ వేదికగా రెండోసారి పాకిస్తాన్ తో తలపడిన భారత్ పరాజయం పాలైంది. గ్రూప్ స్టేజ్‌లో పాకిస్తాన్ చిత్తు చేసిన భారత్.. సూపర్ 4లో మాత్రం తడబడింది. పాక్ జట్టు టీమిండియాపై పగ తీర్చుకున్నట్లైంది. టాస్ ఓడి బ్యాటింగ్ వెళ్లిన భారత్ ఆ తర్వాత తడబడుతూనే మంచి స్కోరే చేసింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 44 బంతుల్లోనే 60 పరుగులు చేసిన కోహ్లీ రనౌట్‌గా పెవెలియన్ చేరాడు. వికెట్లు పడుతున్న అలాంటి సమయంలో గట్టిగా నిలబడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి వచ్చేశాడని అంతా ఫిక్స్ అయిపోయారు.
మ్యాచ్ రిజల్ట్ ని పక్కన పెడితే ప్రస్తుతం దీపక్ హుడా- విరాట్ కోహ్లీ పేర్లు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో దీపక్ హుడా ఆడిన ఒక షాట్ అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 18వ ఓవర్ వేసేందుకు హస్నైన్ వచ్చాడు. ఆ ఓవర్లో తొలి బంతిని వైడ్‌గా వేశాడు. ఆ తర్వాత రెండు బంతుల్లో రెండు రెండు పరుగులు చేశారు. మూడో బంతి షార్ట్ బాల్ సందించగా దీపక్ హుడా వెనకకు ఒంగి కీపర్ పైనుంచి వన్ బౌన్స్ ఫోర్‌గా మలిచాడు. ఆ షాట్ చూసిన వారికి కాసేపు ఏమీ అర్థం కాలేదు. దీపక్ తన వంటిని విల్లు వంచినట్లు వంచడం చూసి కోహ్లీ సైతం కంగుతిన్నాడు. కోహ్లీ రియాక్షన్ చూస్తేనే అర్థమవుతుంది.. హుడా బ్యాటింగ్‌కు ఫిదా అయిపోయాడని.
Even king kohli 👑 is enjoying that shot of Deepak hooda
What a shot 🔥#INDvsPAK pic.twitter.com/vOOpOleK39
— Rishabh pant fan club (@rishabpantclub) September 4, 2022
ఇంక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కోహ్లీ(60 పరుగులు), కేఎల్ రాహుల్(28), రోహిత్ శర్మ(28) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. పాక్‌లో మహ్మద్ రిజ్వాన్ (71), నవాజ్(42) ఆకట్టుకున్నారు. బౌలింగ్ విషయానికి వస్తే.. భువనేశ్వర్, అర్షదీప్, రవి బిష్ణోయ్, హార్దిక్, చాహల్ తలా ఒక వికెట్ పడగొట్టారు. హార్దిక్(44), చాహల్(43), భువనేశ్వర్ 40 పరుగులు ఇచ్చి చాలా ఎక్స్ పెన్సివ్గా మారారు. ఇక నుంచి రాబోయే అన్ని మ్యాచుల్లో గెలిస్తేనే భారత్‌కు ఫైనల్ చేరే అవకాశం దక్కుతుంది. దీపక్ హుడా మాస్ బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) September 5, 2022