వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో కోహ్లీ 36 పరుగులు చేసి మంచి టచ్ లోకి వచ్చాడు. ఇక ఈ మ్యాచ్ మధ్యలో విండీస్ బౌలర్ పై కోహ్లీ అసహనం వ్యక్తం చేసాడు.
వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. తొలి రోజు బౌలర్లు, రెండు రోజు బ్యాటర్లు రాణించడంతో భారత్ కి విజయం నల్లేరు మీద నడకే అన్నట్లుగా ఉంది. ఇప్పటికే 162 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించిన రోహిత్ సేన మూడో రోజు మరింత రెచ్చిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. వికెట్లేమీ కోల్పోకుండా 80 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్.. రోహిత్(103) జైస్వాల్ సెంచరీలతో విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. మూడో స్థానంలో వచ్చిన గిల్ నిరాశాపరిచినా.. విరాట్ కోహ్లీ (36), జైస్వాల్(143) మరో వికెట్ వికెట్ పడకుండా (312/2) రెండో రోజుని ముగించారు. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ మధ్యలో విండీస్ కెప్టెన్ బ్రాత్ వైట్ బౌలింగ్ కోహ్లీకి కోపాన్నితెప్పించింది.
విండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో విరాట్ కోహ్లీ ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే ఎంతో ఏకాగ్రతగా ఆడుతున్న కోహ్లీకి బ్రాత్ వైట్ బౌలింగ్ యాక్షన్ చిరాకు తెప్పించింది. ఈ సందర్భంగా కోహ్లీ.. జైస్వాల్ తో విండీస్ కెప్టెన్ బౌలింగ్ గురించి మాట్లాడడం స్టంప్ మైక్ రికార్డ్ అవ్వడం ప్రస్తుతం వైరల్ గా మారింది. బ్రాత్ వైట్ బౌలింగ్ వేస్తుంటే ఏదో ఇటుకలు మీదకి విసిరినట్టుగా ఉంది అని చెప్పినట్లుగా అర్ధం అవుతుంది. ఈ సంగతి పక్కన పెడితే బ్రెత్ వైట్ బౌలింగ్ యాక్షన్ మీద గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. 2019 లో విండీస్ పర్యటనకు భారత్ వెళ్లినప్పుడు టీమిండియా ఆటగాళ్లు ఈ బౌలర్ యాక్షన్ పై అసంతృప్తి వ్యక్తం చేసారు.
ఇక 2017 లో బ్రాత్ వైట్ బౌలింగ్ యాక్షన్ పై విమర్శలు వచ్చాయి. అయితే ఇతని యాక్షన్ ని పరిశీలించిన ఐసీసీ.. ఎలాంటి తప్పు లేదని నిబంధనలకు అనుగుణంగానే బౌలింగ్ చేస్తున్నాడని స్పష్టం చేసింది. తాజాగా విరాట్ కోహ్లీ అలాంటి వ్యాఖ్యలే చేయడం మరోసారి చర్చనీయాంశమైంది. అయితే కోహ్లీ.. అంపైర్ కి ఈ విషయం చెప్పకుండా కేవలం తన భాగస్వామి జైస్వాల్ తో చెప్పడంతో వివాదం చోటు చేసుకోలేదు. మరి కోహ్లీ అసహనం ప్రదర్శించడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.