SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Virat Kohli Gifted His Signed Jersey To Pakistani Cricketer Haris Rauf

Asia Cup 2022: పాక్‌ క్రికెటర్‌కు అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన విరాట్‌ కోహ్లీ

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Tue - 30 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Asia Cup 2022: పాక్‌ క్రికెటర్‌కు అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన విరాట్‌ కోహ్లీ

టీమిండియా మాజీ కెప్టెన్‌ కింగ్‌ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. మన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌లో కూడా కోహ్లీని ఆరాధించే వారునున్నారు. అంతే కాదు.. ఏకంగా పాకిస్థాన్‌ జట్టులోనే విరాట్‌ కోహ్లీని విపరీతంగా అభిమానించే క్రికెటర్‌ ఉన్నాడు. మైదానంతో ప్రత్యర్థులమైనా, తమ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా.. నేను మాత్రం కోహ్లీకి అభిమానినే అని చెప్తున్నాడు పాక్‌ స్టార్‌ పేసర్‌ హరీస్‌ రౌఫ్‌. ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం ఇండియా-పాకిస్థాన్‌ జట్లు తలపడ్డ విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో పాక్‌ను చిత్తుచేసి ఆసియా కప్‌ వేటను ఘనంగా ఆరంభించింది. చాలా కాలంగా ఫామ్‌లో లేని కోహ్లీ.. పాక్‌తో మ్యాచ్‌లో కొంత టచ్‌లోకి వచ్చాడు. 35 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.

ఇక ఈ మ్యాచ్‌ అనంతరం హరిస్‌ రౌఫ్‌ తన అభిమాన క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీని కలిసి చాలా సేపు ముచ్చటించాడు. కోహ్లీ కూడా రౌఫ్‌తో ఎంతో ఆప్యాయంగా మాట్లాడాడు. కోహ్లీని ఎంతో అభిమానించే రౌఫ్‌.. ఆటోగ్రాఫ్‌ చేసిన తన జెర్సీ కావాలని కోహ్లీని కోరడంతో.. కోహ్లీ సంతకం చేసిన తన జెర్సీని రౌఫ్‌కు అందిస్తాడు. ఈ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ను రౌఫ్‌ ఎంతో సంతోషంతో స్వీకరించాడు. జెర్సీ అందుకున్న సమయంలో అతని ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఎంతో ఆనందంతో దాన్ని తీసుకుని వెళ్లాడు. ఈ అరుదైన ఘటనకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్టు చేసింది. పోస్టు చేసిన కొన్ని నిమిషాల్లోనే ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

Kohli

కోహ్లీపై అభిమానానికి దేశాలు, సరిహద్దులు, శత్రుత్వం అడ్డుకాదని కోహ్లీ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో పేర్కొంటున్నారు. కాగా.. టీమిండియా ఆటగాళ్లను కలిసేందుకు వారిపై తమ అభిమానం చూపించేందుకు దుబాయ్‌లోని పాకిస్థాన్‌ అభిమానులు ఎగబడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా పాక్‌ క్రికెటరే కోహ్లీని ఆటోగ్రాఫ్‌ చేసిన జెర్సీ కోరడంతో ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ తెగ సంబరపడిపోతున్నారు. కాగా.. గతేడాది టీ20 వరల్డ్‌ కప్‌లో తలపడ్డ దాయాదులు.. మళ్లీ ఇన్ని రోజులకు ఆసియా కప్‌లో ఢీకొన్నాయి. టీ20 వరల్డ్‌ కప్‌లో పాక్‌ గెలిస్తే.. ఇప్పుడు టీమిండియా గెలిచ లెక్కసరిచేసింది. కాగా.. మళ్లీ ఈ రెండు జట్లు ఈ టోర్నీలోనే తలపడే అవకాశం ఉంది. ఇది నిజంగా క్రికెట్‌ అభిమానులకు మంచి కిక్కించే విషయం.

Kohli

ప్రస్తుతం లీగ్‌ దశలో తలపడిన ఈ రెండు జట్లు ఫైనల్‌లో లేదా, సూపర్‌ ఫోర్‌లో తలపడే అవకాశం ఉంది. అలాగే అక్టోబర్‌లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో కూడా ఇండియా పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరగనుంది. మరి ఈ రెండు దేశాల మధ్య పోరంటే క్రికెట్‌ అభిమానులు ఎక్కడలేని ఆసక్తి చూపిస్తారు. లీగ్‌ మ్యాచ్‌తోనే హాట్‌స్టార్‌లో అత్యధిక మంది వీక్షించిన మ్యాచ్‌గా రికార్డు సృష్టించింది. ఇక ఆసియా కప్‌ ఫైనల్‌లో తలపడినా, ఆ తర్వాత టీ20 వరల్డ్‌ కప్‌లో ఢీకొన్న ఈ కొత్త రికార్డు చెరిగిపోవడం ఖాయం. మరి ఇండియా-పాకిస్థాన్‌ రైవల్రీ, పాక్‌ ప్లేయర్‌ రౌఫ్‌కు కోహ్లీ జెర్సీ గెఫ్ట్‌గా ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: అంతా హార్దిక్ పాండ్యాని పొగుడుతున్నారు. కానీ.., అసలు హీరో కోహ్లీనే!

Nice gesture from Virat Kohli to gift a signed jersey to Haris Rauf. pic.twitter.com/QwnD7Q3Qrw

— Johns. (@CricCrazyJohns) August 29, 2022

Tags :

  • Asia Cup 2022
  • Cricket News
  • Haris Rauf
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam