SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #బడ్జెట్ 2023
  • #మూవీ రివ్యూస్
  • #90's క్రికెట్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Virat Kohli Gifted His Signed Jersey To Mehidy Hasan Miraz

తన వికెట్‌ తీసిన బంగ్లా బౌలర్‌ మెహిదీకి గిఫ్ట్‌ ఇచ్చిన కోహ్లీ!

    Published Date - Mon - 26 December 22
  • |
      Follow Us
    • Suman TV Google News
తన వికెట్‌ తీసిన బంగ్లా బౌలర్‌ మెహిదీకి గిఫ్ట్‌ ఇచ్చిన కోహ్లీ!

టీమిండియా మాజీ కెప్టెన్‌, రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లీ.. ప్రస్తుతం ఉన్న గొప్ప క్రికెటర్లలోనే నంబర్‌ వన్‌ ఆటగాడు. అతన్ని అవుట్‌ చేయడమే ఒక కలగా భావించే యువ క్రికెటర్లు ఉన్నారు. కోహ్లీ వికెట్‌ దక్కింతే.. మ్యాచ్‌ గెలిచినంత సంబరపడే బౌలర్లు చాలా మందే ఉన్నారు. ప్రస్తుతం కోహ్లీ టెస్టు క్రికెట్‌లో పెద్దగా ఫామ్‌లో లేకపోయనా.. అతని వికెట్‌ ఎంతో కీలకం. అవుట్‌ ఆఫ్‌ ఫామ్‌లో ఉన్నా కూడా.. కోహ్లీ క్రీజ్‌లో ఉన్నాడంటే.. ప్రత్యర్థి బౌలర్లు ఒళ్లు దగ్గరపెట్టుకుని బౌలింగ్‌ చేయాల్సిందే. అలాంటి.. ఆటగాడు కాబట్టే కోహ్లీని అభిమానించే, ఆరాధించే క్రికెటర్లు సైతం ఉన్నారు. వారి జాబితాలో బంగ్లాదేశ్‌ యువ సంచనలం మెహిదీ హసన్‌ మిరాజ్‌ కూడా ఒకడు. ఈ యువ ఆల్‌రౌండర్‌.. టీమిండియాపై వన్డే, టెస్టు సిరీస్‌లో ఎలాంటి అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడో అందరూ చూశారు.

టీమిండియా లాంటి పటిష్టమైన జట్టుపై బంగ్లాదేశ్‌ వన్డే సిరీస్‌ను 2-1తో తేడాతో గెలిచిందంటే అందుకు ప్రధాన కారణం ఈ మెహిదీ హసన్‌. తొలి వన్డేలో బంగ్లాదేశ్‌ 139 పరుగులకే 9 వికెట్లు కోల్పోయినా.. ఒంటిరిగా విరోచిత పోరాటం చేస్తూ.. 38 పరుగులతో నాటౌట్‌గా నిలిచి.. బంగ్లాదేశ్‌కు గొప్ప విజయాన్ని అందించాడు. ఆ తర్వాత.. రెండో వన్డేలో ఏకంగా సెంచరీతో చెలరేగాడు. పటిష్టమైన బౌలింగ్‌ లైనప్‌ ఉన్న భారత్‌పై 8వ స్థానంలో బ్యాటింగ్‌ వచ్చి సెంచరీ కొట్టాడు. అలాగే బౌలింగ్‌లోనూ సంచలనాలు నమోదు చేశాడు. మూడు వన్డేల్లో మొత్తం 4 వికెట్లు పడగొట్టాడు. 141 పరుగులు చేశాడు. ఇక టెస్టు సిరీస్‌లోనూ మెహిదీ అదరగొట్టాడు. తొలి టెస్టులో టీమిండియా ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టిన మెహిదీ.. బ్యాటింగ్‌లోనూ రాణించి.. 25 పరుగులు చేశాడు.

అలాగే భారత రెండో ఇన్నింగ్స్‌లోనూ ఒక వికెట్‌ పడగొట్టి.. తొలి టెస్టులో మొత్తం 5 వికెట్లు సాధించాడు. ఇక చివరిదైన రెండో టెస్టులోనూ మెహిదీ 6 వికెట్లు సాధించాడు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ అద్భుతంగా పోరాడి ఓడినా.. టీమిండియాను 145 పరుగుల టార్గెట్‌ను ఈజీగా చేరుకోనియకుండా.. మోహిదీ వణికించాడు. ఈ 6 వికెట్లలో ప్రపంచంలోనే గొప్ప బ్యాటర్‌ అయిన విరాట్‌ కోహ్లీ వికెట్‌ కూడా ఉంది. 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లీని.. ఇబ్బంది పెట్టిన మెహిదీ.. 20 బంతుల్లో ఒక్క పరుగు చేసిన కోహ్లీని అద్భుతమైన బంతితో పెవిలియన్‌కు చేర్చాడు. కోహ్లీ వికెట్‌ దక్కిన ఆనందంలో మోహిదీ చేసుకున్న సంబరాలు మాటల్లో చెప్పలేం.

అయితే.. ఈ సిరీస్‌ ఆసాంతం అద్భుతంగా రాణించి.. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో తనను అవుట్‌ చేసిన మెహిదీకి విరాట్‌ కోహ్లీ ప్రత్యేకమైన బహుమానం అందించాడు. తన జెర్సీపై సంతకం చేసి మెహిదీకి అందించాడు కోహ్లీ. దాన్ని ఎంతో అపురూపంగా అందుకున్న మోహిదీ.. ‘గ్రేటెస్ట్‌ బ్యాటర్‌ నుంచి ప్రత్యేకమైన సావియర్‌ అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని’ సోషల్‌ మీడియాలో పేర్కొంటూ మురిసిపోయాడు. మరి కోహ్లీ ఇచ్చిన గిఫ్ట్‌పై, మెహిదీ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Special souvenir from one of the greatest cricketer Virat Kohli. 🤝 pic.twitter.com/y67twA2Rle

— Mehidy Hasan Miraz (@Officialmiraz) December 25, 2022

Tags :

  • Cricket News
  • IND VS BAN
  • Mehidy Hasan Miraz
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పృథ్వీ షాను కూల్ చేసేందుకే అలా చేశాడా?.. హార్దిక్ తెలివికి జోహార్లు అంటున్న ఫ్యాన్స్

పృథ్వీ షాను కూల్ చేసేందుకే అలా చేశాడా?.. హార్దిక్ తెలివికి జోహార్లు అంటున్న ఫ్యాన్స్

  • 14 రన్స్‌కే 3 వికెట్లు! మలాన్‌, బట్లర్‌ పోరాటంతో ఇంగ్లండ్‌ విజయం

    14 రన్స్‌కే 3 వికెట్లు! మలాన్‌, బట్లర్‌ పోరాటంతో ఇంగ్లండ్‌ విజయం

  • రానున్న కాలంలో టీమిండియాను నడిపించేది, గెలిపించేది అతనే?

    రానున్న కాలంలో టీమిండియాను నడిపించేది, గెలిపించేది అతనే?

  • సచిన్ గ్రౌండ్‌లోనే ఉన్నా శుబ్‌మన్‌ గిల్‌కు అవార్డు ఇవ్వడానికి ఎందుకు రాలేదు?

    సచిన్ గ్రౌండ్‌లోనే ఉన్నా శుబ్‌మన్‌ గిల్‌కు అవార్డు ఇవ్వడానికి ఎందుకు రాల...

  • వీడియో: ఉమ్రాన్‌ మాలిక్‌ సూపర్ స్పీడ్‌! బౌండరీ లైన్‌ దగ్గర పడ్డ బెయిల్స్!

    వీడియో: ఉమ్రాన్‌ మాలిక్‌ సూపర్ స్పీడ్‌! బౌండరీ లైన్‌ దగ్గర పడ్డ బెయిల్స్!

Web Stories

మరిన్ని...

స్నానం చేసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి!
vs-icon

స్నానం చేసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి!

స్వీట్స్ తిన్న తర్వాత నీరు తాగుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..
vs-icon

స్వీట్స్ తిన్న తర్వాత నీరు తాగుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..

కొంటె చూపుతో కవ్విస్తున్న రాశి ఖన్నా..
vs-icon

కొంటె చూపుతో కవ్విస్తున్న రాశి ఖన్నా..

పామాయిల్ వాడుతున్నారా? అయితే ప్రమాదంలో పడ్డట్టే..
vs-icon

పామాయిల్ వాడుతున్నారా? అయితే ప్రమాదంలో పడ్డట్టే..

తాజా వార్తలు

  • మేకప్‌ రూమ్‌లో పేలుడు.. ప్రముఖ నటి పరిస్థితి విషమం!

  • దత్తతకు ఆడపిల్లల వైపు మొగ్గు చూపుతున్న దంపతులు

  • నేవీలో ఉచితంగా ‘ఇంజినీరింగ్’ విద్య, ఆపై ఉన్నత‌ ఉద్యోగం.. పూర్తి వివరాలివే!

  • ఇండియాలో తొలిసారిగా విమానాశ్రయంలో సినిమా థియేటర్! ఎక్కడంటే?

  • పిల్లలకు ఎలుకల మందు పెట్టి చంపిన కసాయి తల్లి! ఎందుకంటే?

  • టాలీవుడ్ రీ ఎంట్రీకి సిద్ధమైన మీరా జాస్మిన్.. ఈసారి కాస్త ఘాటుగానే..!

  • ‘వీరసింహారెడ్డి’ సినిమా పరిటాల రవి జీవితం నుంచి తీసుకున్న కథే: దర్శకుడు

Most viewed

  • కోడల్ని మనువాడిన మామ.. ఎందుకంటే..?

  • విమానాల్లో తాగడానికి మద్యం ఇస్తారు! ఎందుకో తెలుసా?

  • హనీరోజ్ 2008లోనే తెలుగులో హీరోయిన్ గా చేసిందని మీకు తెలుసా? ఏ సినిమా అంటే?

  • స్త్రీలు పెట్టుకునే మల్లెపూల వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్.. మీకు తెలుసా?

  • కొడుకు ఉన్నా కూతురు చేతుల మీదగానే జమున అంత్యక్రియలు పూర్తి!

  • ఈ ఒక్కరోజే ఓటిటిలో రిలీజ్ అవుతున్న 19 సినిమాలు!

  • ‘అక్కినేని తొక్కినేని’ వివాదంపై స్పందించిన బాలకృష్ణ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam