టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును నమోదు చేశాడు. ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌తో టీ20ల్లో 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. దీంతో టీమిండియా తరఫున అన్ని ఫార్మాట్లలో 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు కోహ్లీ.. 262 వన్డేలు, 102 టెస్టులు, 100 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇలా మూడు ఫార్మాట్లలో 100కు పైగా మ్యాచ్‌లు ఆడిన తొలి భారత క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. అలాగే అంతర్జాతీయంగా 100 మ్యాచ్‌లు ఆడిన రెండో ఆటగాడు కోహ్లీ రికార్డు సృష్టించాడు. కోహ్లీ కంటే ముందు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ మూడు ఫార్మాట్లలోనూ 100 మ్యాచ్‌లు పైనే ఆడాడు.
ఇక చాలా కాలంగా సరైన ఫామ్‌లో లేని కోహ్లీ.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో పర్వాలేదనిపించాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ డకౌట్ అవ్వడంతో కోహ్లీ తొలి ఓవర్‌లోనే బ్యాటింగ్‌కు రావాల్సి వచ్చింది. పాక్ కట్టుదిట్టమైన బౌలింగ్‌ను సమర్థంగా జాగ్రత్తగా ఎదుర్కొని.. 34 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో రాణించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.5 ఓవర్లలో 147 పరుగులుచేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ రిజ్వాన్ 43 పరుగులతో రాణించగా మిగతా బ్యాటర్లు విఫలం అయ్యారు. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లతో పాకిస్థాన్ పతనాన్ని శాసించాడు. అలాగే అర్షదీప్ సింగ్ 2, హార్దిక్ పాండ్యా 3, ఆవేశ్ ఖాన్ ఒక వికెట్‌తో చెలరేగి పాక్‌ను తక్కువ స్కోర్‌కే ఆలౌట్ చేశారు.
టీమిండియా 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యఛేదించింది. బౌలింగ్‌లో రాణించిన పాండ్యా బ్యాటింగ్‌లను అదరగొట్టాడు. రవీంద్ర జడేజా(35) పరుగులతో రాణించారు. ఇక అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లలో 100పైగా మ్యాచ్‌లు పూర్తి చేసిన కోహ్లీకి దరిదాపుల్లో కూడా మరే క్రికెటర్ లేడు. రోహిత్ శర్మ ఇప్పటికే 132 టీ20 మ్యాచ్‌లు ఆడేసినా.. టెస్టులు మాత్రం చాలా తక్కువ ఆడాడు. కోహ్లీ 100 టీ20ల్లో 49.89 సగటుతో 3343 పరుగులు చేశాడు. అందులో 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 262 వన్డేల్లో 57.68 సగటుతో 12344 పరుగులు, 102 టెస్టుల్లో 49.53 సగటుతో 8074 పరుగులు సాధించాడు. కోహ్లీ ఖాతాలో ఇప్పటికే 70 సెంచరీలు, 122 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరి విరాట్ కోహ్లీ సాధించిన ఈ అరుదైన రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: టీమిండియాను గెలిపించిన హార్దిక్ పాండ్యాను దినేష్ కార్తీక్ ఎలా గౌరవించాడో తెలుసా..?
1⃣0⃣0⃣ and counting 🤩
Congratulations to Virat Kohli on the incredible milestone 🎉
Some of his best knocks 👉 https://t.co/NsSeXv3n7C pic.twitter.com/agyNCo5Wc9
— ICC (@ICC) August 28, 2022