టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన రోల్‌ను మరోసారి వందశాతం పోషించాడు. స్పెషలిస్ట్ బౌలర్లును సైతం కాదని కెప్టెన్ రోహిత్ రోహిత్ శర్మ పూర్తి కోటా బౌలింగ్ ఇచ్చి తనపై పెట్టుకున్న నమ్మకానికి నిలబెట్టుకుంటూ.. మూడు కీలకమైన వికెట్లు పడగొట్టడంతో పాటు బ్యాటింగ్‌లో అద్భుతంగా చెలరేగి చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై మధురమైన విజయాన్ని అందించాడు. ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్లతో తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ పాండ్యా 3 వికెట్టు, 33 పరుగులతో టీమిండియాను గెలిపించాడు. లక్ష్యం చిన్నదే అయినా.. భారత టాపార్డర్ బ్యాటర్లు త్వరగా అవుట్ అవ్వడంతో విజయం కష్టంగా మారింది. ఈ దశలో పాండ్యా అద్భుతంగా రాణించాడు. కేవలం 17 బంతుల్లోనే 4 ఫోర్లు ఒక సిక్స్‌తో 33 పరుగులు చేసి అదరగొట్టాడు. ఇక చివరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన మ్యాచ్‌లో సిక్స్‌తో మ్యాచ్ ముగించాడు. ఆ సమయంలో నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న మరో స్టార్ ఫినిషర్ దినేష్ కార్తీక్ పాండ్యాను అరుదైన రితీలో గౌరవించాడు. అలాంటి ఒత్తిడి సమయంలో బ్యాటింగ్ చేయడం ఎంత గొప్ప విషయమో ఒక ఫినిషర్‌గా దినేష్ కార్తీక్‌కు తెలుసు.. అందుకే హార్దిక్ పాండ్యా ఆడిన ఇన్నింగ్స్‌కు తలొంచి గౌరవ వందనం అందించాడు. దానికి పాండ్యా ఒకింత షాక్ అవుతూ నవ్వులు చిందిస్తాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.5 ఓవర్లలో 147 పరుగులుచేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ రిజ్వాన్ 43 పరుగులతో రాణించగా మిగతా బ్యాటర్లు విఫలం అయ్యారు. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లతో పాకిస్థాన్ పతనాన్ని శాసించాడు. అలాగే అర్షదీప్ సింగ్ 2, హార్దిక్ పాండ్యా 3, ఆవేశ్ ఖాన్ ఒక వికెట్‌తో చెలరేగి పాక్‌ను తక్కువ స్కోర్‌కే ఆలౌట్ చేశారు. ఇక టీమిండియా 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యఛేదించింది. బౌలింగ్‌లో రాణించిన పాండ్యా బ్యాటింగ్‌లను అదరగొట్టాడు. అలాగే విరాట్ కోహ్లీ(35), రవీంద్ర జడేజా(35) పరుగులతో రాణించారు. ఈ విజయంతో టీమిండయా పాకిస్థాన్‌పై టీ20 వరల్డ్ కప్‌లో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకున్నట్లు అయింది. మరి ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ప్రదర్శన, అతనికి దినేష్ కార్తీక్ ఇచ్చిన డౌన్ బౌ రెస్పెక్ట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: వీడియో: జాతీయ పతాకాన్ని పట్టుకునేందుకు నిరాకరించిన అమిత్ షా కుమారుడు! Dinesh Karthik bowed down to Hardik Pandya after he finished the game. pic.twitter.com/z9VhblklKI — Mufaddal Vohra (@mufaddal_vohra) August 28, 2022 Beautiful Moment in India Vs Pak Match Today. Dinesh Karthik bowed before Hardik Pandya. Well done Team India. #INDvsPAK #IndiaVsPakistan #IndianCricketTeam #HardikPandya #DineshKarthik #AsiaCup2022 pic.twitter.com/vuro2ZXd7H — Tarique Anwer (@tariqueSH) August 28, 2022