'నువ్వంటే బౌలర్లు భయపడతారేమో.. నేను కాదు. నాతో పోటీ పడలేవ్..' అంటూ మాస్ డ్యాన్స్‌తో హోరెత్తించింది.. అనుష్క శర్మ. మైదానంలో టన్నులు కొద్దీ పరుగులు చేసిన మన 'రన్ మెషిన్..' డ్యాన్స్‌లో అనుష్కతో పోటీ పడలేకపోయాడు.
‘విరాట్ కోహ్లీ..’ ఈ పేరు క్రికెట్ ప్రపంచానికో బ్రాండ్, మైదానంలో టన్నులు కొద్దీ పరుగులు చేసిన ఆటగాడు, ప్రత్యర్థి జట్లను సవాల్ చేసే మొనగాడు, పరుగుల రారాజు. ఇలా కోహ్లీ గురుంచి చెప్పుకుంటూ పోతే ఎన్నైనా చెప్పొచ్చు. ఎందుకంటే కోహ్లీ ఎప్పుడూ ఆడే ఆట.. క్రికెట్. అందులో రికార్డులు సృష్టించడంలో ఆశ్చర్యపోనవసరం లేదు. అదే కోహ్లీని స్టెప్పులు ఇరగదీయమంటే సాధ్యమా..? ఏదో ఒకటి.. రెండు. అంతకుమించి ఆశిస్తే ఇలా పిక్కలు పట్టేయడం తప్ప ఇంకేమీ ఉండదు. అనుష్క శర్మతో కలిసి కోహ్లీ డ్యాన్స్ వేసిన కోహ్లీ ఆమెతో పోటీ పడలేకపోయాడు. పిక్కలు పట్టేయడంతో ‘ఆ..’ ఆ అంటూ పక్కకు తప్పుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.
పెళ్ళికాకముందు అనుష్క శర్మ ఒక నటి అందరికీ ఈ విషయం గుర్తుంది కదా! అలాంటి నటితో డ్యాన్స్‌లో పోటీ అంటే మాములుగా ఉంటదా! ఉండదు. ఈ అమ్మడు స్టెప్పులు ఇరగదీసింది. విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మ జంటగా కలిసి ఓ పంజాబీ పాటకు స్టెప్పులేశారు. అందుకు సంబంధించిన వీడియోను అనుష్కా తన ఇన్‌స్టాలో పోస్టు చేసింది. పంజాబీ ఆర్టిస్టు శుభ్ పాడిన పాటకు.. జిమ్‌లో ఈ ఇద్దరూ స్టెప్పులేశారు. ఫుల్ ఎనర్జిటిక్‌గా లోనికి ఎంట్రీ ఇచ్చిన కోహ్లీ.. రెండు స్టెప్పులేసి కాలు పట్టేసుకున్నాడు. దీంతో అనుష్క నవ్వుతూ ఉండిపోయింది. ఈ జంట డ్యాన్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఈ వీడియోను మీరూ తిలకించి కోహ్లీ డ్యాన్స్ స్కిల్స్‌పై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.