టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఏం చేసినా అభిమానులకి పండుగే. ఇక కోహ్లీ సోషల్ మీడియాలో ఒక్క ఫోటో షేర్ చేస్తే గంటలో మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తాయి. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసి వారం రోజులైనా విరాట్ కోహ్లీ ఇంకా లండన్ లో ఉన్నాడు. అక్కడ ప్రశాంతంగా గడపడానికి కోహ్లీ చేసిన ఒక పని ఇప్పుడు వైరల్ గా మారింది.
ఓవల్ వేదికగా జరిగిన టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత జట్టు ఘోర ఓటమిని చవి చూసిన సంగతి తెలిసిందే. వరుసగా రెండో సారి టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కి చేరిన టీమిండియా.. ఈ సారి కూడా ఓడిపోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో మన జట్టుపై సర్వత్రా విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే టీమిండియా క్రికెటర్లు ఈ ఓటమిని మర్చిపోయి ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నారు. కొంత మంది క్రికెటర్లు మాత్రం స్వదేశానికి చేరుకోకుండానే అక్కడడక్కడ హాలిడే వెకేషన్ కి వెళ్తూ కనిపించారు. రోహిత్ శర్మ మాల్దీవులకు వెళ్లి తన భార్యతో చిల్ అవుతున్నాడు. ఇక విరాట్ కోహ్లీ డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసి వారం రోజులైనా ఇంకా లండన్ లో ఉన్నాడు. అక్కడ ప్రశాంతంగా గడపడానికి కోహ్లీ చేసిన ఒక పని ఇప్పుడు వైరల్ గా మారింది.
టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఏం చేసినా అభిమానులకి పండుగే. ఇక కోహ్లీ సోషల్ మీడియాలో ఒక్క ఫోటో షేర్ చేస్తే గంటలో మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తాయి. తాజాగా లండన్ లో కోహ్లీ భార్య అనుష్క శర్మతో కలిసి లండన్‌లో కృష్ణదాస్ కీర్తనలకు హాజరయ్యాడు. అక్కడి బెంచీ మీద కూర్చొని కీర్తనలు వింటూ ప్రశాంతతను ఆస్వాదించాడు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. విరుష్క జోడీకి ఆధ్యాత్మిక భావాలు కాస్త ఎక్కువే. ఎప్పుడైతే కోహ్లీ ఆధ్యాత్మక యాత్రలు చేపట్టాడో అప్పటినుంచి కోహ్లీకి మళ్ళీ తన పునర్వైభవాన్ని చూపిస్తున్నాడు.
గతంలో నీమ్ కరోలీ బాబా ఆశ్రమాన్ని ఈ జోడి ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇక ఉజ్జయినీలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఇక ప్రస్తుతం త్వరలో జరగబోయే విండీస్ పర్యటనకు కోహ్లీ సిద్ధం కానున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారీ అంచనాల మధ్య కోహ్లీ విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో కేవలం 14 పరుగులే చేసిన కోహ్లీ.. రెండో ఇన్నింగ్స్ లో 49 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఇక ఈ ఏడాది ఆసియా కప్, వరల్డ్ కప్ ఉండడంతో కోహ్లీ మీద దేశంలో అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. మొత్తానికి లండన్ లో కోహ్లీ ప్రశాంతత కోసం ఇలా కృష్ణ దాస్ కీర్తనలు వినడం మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
Virat Kohli and Anushka Sharma at the Krishna Das Kirtan show in London. pic.twitter.com/FHOpLxFOfI
— CricketMAN2 (@ImTanujSingh) June 17, 2023