భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా మారింది. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 231 పరుగులకే ఆలౌట్.. టీమిండియా ముందు కేవలం 145 పరుగుల టార్గెట్ మాత్రమే ఉంచడంతో.. మ్యాచ్ ఏకపక్షం అవుతుందని అంతా భావించారు. కానీ.. మూడో రోజు ఆట ముగిసే.. కొన్ని ఓవర్ల ముందు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాను బంగ్లాదేశ్ బౌలర్లు ఇబ్బందిపెట్టారు. కేవలం 37 పరుగులకే 4 కీలక వికెట్లు పడగొట్టి.. టీమిండియాను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టారు. టార్గెట్ అంత పెద్దగా లేకపోయినా.. బంగ్లాదేశ్ బౌలర్లు భారత టాపార్డర్‌ను కుప్పకూల్చి.. మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చారు. మూడో రోజు ఆటముగిసే సమయానికి.. టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 45 పరుగుల వద్ద ఉంది. రెండో టెస్టులో విజయానికి మరో 100 పరుగులు కావాలి. చేతిలో ఇంకా 6 వికెట్లు ఉన్నా.. నాలుగో రోజు సైతం బంగ్లాదేశ్ బౌలర్లు చెలరేగి బౌలింగ్ చేస్తే.. మ్యాచ్ మరింత ఇంట్రస్టింగ్ మారే అవకాశం.
మ్యాచ్ పరిస్థితి ఇలా ఉంటే.. ఈ మ్యాచ్ మధ్యలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆగ్రహంతో ఊగిపోయాడు. బంగ్లాదేశ్ ఆటగాళ్ల చిల్లర చేష్టలకు చిర్రెత్తుకొచ్చిన కోహ్లీ.. బంగ్లాదేశ్ టీమ్‌పైకి గొడవకు దూసుకెళ్లాడు. అంపైర్‌తో పాటు, కాస్త సీనియర్ అయిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఎదురొచ్చి.. కోహ్లీని సముదాయించి వెనక్కి పంపించారు. లేకుంటే.. పెద్ద గొడవే జరిగేది. తనకొచ్చిన పట్టరాని కోపంతో ఊగిపోయిన కోహ్లీ.. మాటలతోనే బంగ్లా ఆటగాళ్లకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఈ గరం గరం సంఘటన టీమిండియా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా.. మూడో రోజు చోటు చేసుకుంది.
విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కు వచ్చే సమయానికే.. టీమిండియా 29 పరుగులకే 3 వికెట్లు పడిపోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో మరో వికెట్ పడకుండా మూడో రోజును ముగిద్దామని భావించిన కోహ్లీ.. చాలా నిదానంగా బ్యాటింగ్ చేశాడు. కేవలం డిఫెన్స్‌తో 19 బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేసిన కోహ్లీ.. మెహిదీ హసన్ వేసిన ఇన్నింగ్స్ 20వ ఓవర్ ఐదో బంతినిక కూడా డిఫెన్స్ ఆడే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు. దీంతో.. బంగ్లాదేశ్ క్రికెటర్లు కోహ్లీ వికెట్ తీసిన సంబురాలను చాలా అతిగా జరుపుకున్నారు. 20 బంతుల్లో ఒక రన్ చేసిన కోహ్లీ అవుటై వెళ్తుంటే.. అతని వైపు చూస్తూ.. ఏదో అన్నారు. దాంతో మండిపోయిన కోహ్లీ.. ఏం అన్నారంటూ.. వారిపైకి దూసుకెళ్లాడు. అంతలోనే అంపైర్, బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ వచ్చి కోహ్లీని సముదాయించి పంపించారు. ఇంతటితో ఈ గొడవ సద్దుమణిగింది. అయితే.. ఈ గొడవకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి ఈ గొడవపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virat Kohli looks unhappy after getting out.#INDvBAN #BANvsINDpic.twitter.com/9r44ZAuOGa
— Cricket Master (@Master__Cricket) December 24, 2022
Virat Kohli gets angry on a Bangladesh player after he was dismiss for just 1 run. Rare sight to watch these days 🥶#INDvBAN #BANvIND pic.twitter.com/aYDBCUi3FQ
— Akshat (@AkshatOM10) December 24, 2022
Big wicket for Bangladesh as Virat Kohli is back in pavilion for just one.
📷: Sony LIV
#ViratKohli #BANvIND pic.twitter.com/4KCennIIAv
— CricTracker (@Cricketracker) December 24, 2022