టీమిండియా మాజీ దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ ఎన్నో అద్భుత రికార్డులను నెలకొల్పారు. అలా వారి పేరిట కొన్ని చెత్త రికార్డులు కూడా ఉన్నాయి. వారి తర్వాత మరికొన్ని గొప్ప రికార్డులు నెలకొల్పిన ఆటగాడు విరాట్ కోహ్లీ. సచిన్ వారుసుడిగా క్రికెట్ ప్రపంచలో సచిన్ నెలకొల్పిన 100 సెంచరీల రికార్డును బద్దలుకొట్టే క్రికెటర్ ఎవరంటే వినిపించే ఒకే ఒక్క పేరు విరాట్ కోహ్లీ.
అలాంటి ఆటగాడు సచిన్, సెహ్వాగ్ పేరిట ఉన్న చెత్త రికార్డును కూడా అధిగమించేలా ఉన్నాడు. భారత్-దక్షిణాఫ్రికా మధ్య పార్ల్ వేదికగా జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. దీంతో మొత్తంగా కోహ్లీ అన్ని ఫార్మాట్లలో కలిపి 31 సార్లు డకౌట్ అయ్యాడు. డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా అన్ని ఫార్మాట్లలో కలిపి 31 సార్లు డకౌట్ అయ్యాడు. సచిన్ 34 సార్లు పరుగులు చేయకుండానే పెవిలియన్ చేరాడు.
అత్యధిక డకౌట్‌లతో సచిన్ అగ్రస్థానంలో ఉంటే.. రెండో ప్లేస్‌లో సెహ్వాగ్ ఉన్నాడు. తాజాగా కోహ్లీ సౌత్‌ఆఫ్రికాతో వన్డేలో డకౌట్ కావడంతో సెహ్వాగ్ చెత్త రికార్డును సమం చేశాడు. ఇంకో నాలుగు సార్లు కోహ్లీ డకౌట్ అయితే.. భారత్ తరఫున అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాట్స్‌మెన్‌గా చెత్త రికార్డును మూటగట్టుకుంటాడు. మరి విరాట్ కోహ్లీ చెత్త రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: డకౌట్ అయిన విరాట్ కోహ్లీ! తన కెరీర్‌లోనే తొలిసారి