టీమిండియా స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు చెప్పగానే.. లెక్కలేనన్ని పరుగులు.. పదుల సంఖ్యలో రికార్డులు.. అద్భుతమైన అవార్డులు.. కోట్లాదిమంది అభిమానులు.. ఇలా ఒకటేమిటి వినడానికి మీకు ఓపిక ఉండాలే గానీ చాలా చెబుతాం. ఇక విరాట్ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా అందరూ తన బ్యాటింగ్ గురించి, అందులో నెలకొల్పిన రికార్డులు గురించి మాట్లాడుకుంటున్నారు. మనం మాత్రం విరాట్ ఒళ్లంతా ఉన్న పచ్చబొట్టు సీక్రెట్స్ గురించి చెప్పబోతున్నాం.
ఇక వివరాల్లోకి వెళ్తే.. విరాట్ కోహ్లీ క్రికెట్ అంటే ఎంతిష్టమో. పచ్చబొట్లు అన్నా సరే అంతే ఇష్టం. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 పచ్చబొట్లు ఉన్నాయి. కోహ్లీ తల్లిదండ్రులంటే చాలా ప్రేమ. తండ్రి 18వ ఏటా చనిపోయారు. క్రికెటర్ గా కొడుకు సక్సెస్ చూడకుండానే ఆయన మరణించారు. దీంతో ఆయన పేరుతో పాటు తల్లి పేరుని కూడా కుడి భుజంపై కోహ్లీ పచ్చబొట్టు వేసుకున్నాడు. ఇక రెండో టాటూ.. కోహ్లీ టీమిండియాలోకి వచ్చిన తర్వాత వేయించుకున్నాడు. టెస్టుల్లో 269, వన్డేల్లో 175 ఆటగాడిగా ఎంట్రీ ఇచ్చాడు. అదే నంబర్లని టాటూలుగా వేసుకున్నాడు.
ఇకపోతే కోహ్లీ శివ భక్తుడు. కష్ట సమయాల్లో శివయ్యని తలుచుకోవడం కోహ్లీకి చిన్నప్పటి నుంచి అలవాటు. దాంతో శివుడి ఆకారాన్ని తన చేతిపై పచ్చబొట్టుగా వేసుకున్నాడు. ఇవే కాకుండా గాడ్స్ ఐ, ఓం సింబల్, వృశ్చిక రాశి, జపాన్ యోధుడు సమురాయ్, శివుడి బొమ్మ పక్కనే ఓ ఆశ్రమం లాంటి సింబల్, ఓ ట్రైబ్ టాటూని పచ్చబొట్లుగా వేసుకున్నాడు. ఇవన్నీ కూడా కోహ్లీ.. సొంత జట్టు పట్ల విధేయతని, పోరాడే తత్వం, ఆటపై దూకుడు, ప్రశాంతంగా ఉండటం లాంటి వాటిని సూచిస్తాయి. విరాట్ బర్త్ డే సందర్భంగా ఆ టాటూలన్నీ కూడా హాట్ టాపిక్ గా మారాయి.
Tattoo On Virat Kohli Body pic.twitter.com/s2Tpvd1PO9
— Sekhar Rambo (@RamboSekhar) November 5, 2022