త్రీడీ ప్లేయర్ విజయ్ శంకర్ మరోసారి జాక్‌పాట్ కొట్టేశాడు. మినీ ఐపీఎల్‌లో ఫామ్‌లో ఉండి, టీమిండియాకు ఆడుతున్న ఆటగాళ్ల కంటే ఎక్కువ ధర కొట్టేశాడు.
టీమిండియా వెటరన్ క్రికెటర్ విజయ్ శంకర్ మరోసారి జాక్‌పాట్ కొట్టాడు. 2018లో టీమిండియాలోకి ఒక సెన్సెషన్‌లా దూసుకొచ్చిన విజయ్ శంకర్ అంతే వేగంగా జట్టులో స్థానం కోల్పోయాడు.ఐపీఎల్లో మంచి డిమాండ్ కలిగి ఉన్నాడు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో అమ్ముడుపోవడమే కష్టమనే స్టేజ్ నుంచి ఏకంగా రూ.1.40 కోట్లకు అమ్ముడయ్యాడు. కొత్త టీమ్ గుజరాజ్ టైటాన్స్ విజయ్ శంకర్‌ను కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో విజయ్ మంచి ప్రదర్శన కూడా చేశాడు. అయితే.. అంతకుముందు మూడేళ్లు సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో ఉన్న విజయ్ శంకర్‌కు ఎస్‌ఆర్‌హెచ్ భారీ ధర చెల్లించింది. ఏకంగా రూ.3.4 కోట్లు ముట్టచెప్పారు.
అయితే.. ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ఇంకా నెలరోజుల సమయం ఉన్న నేపథ్యంలో విజయ్ శంకర్ మరో జాక్ పాట్ కొట్టేశాడు. ఇండియాలో మినీ ఐపీఎల్‌గా చెప్పుకునే.. తమిళనాడు ప్రీమియర్ లీగ్ వేలంలో విజయ్ శంకర్ రికార్డు ధర పలికాడు. రూ.10.25 లక్షలకు ఐడ్రీమ్ తిరుపూర్ తమిజాన్స్ జట్టు విజయ్ శంకర్‌ను ఈ భారీ ధరపెట్టి కొనుగోలు చేసింది. వేలంలో ఇదే అత్యంత భారీ ధర. మరికొంత మంది టీమిండియా ఆటగాళ్లు కూడా గురువారం జరిగిన ఈ వేలంలో పాల్గొన్నా.. వారికి అంత ధర రాలేదు. వాషింగ్టన్ సుందర్‌ణు మధురై పాంథర్స్ రూ.6.75 లక్షలకు కొనుగోలు చేసింది. అలాగే మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని దిండిగుల్ డ్రాగన్స్ రూ.6.75 లక్షలకు సొంతం చేసుకుంది. అలాగే స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను దిండిగుల్ డ్రాగన్స్ రూ.60 లక్షలకు రిటేన్ చేసుకుంది.
అయితే.. ఐపీఎల్ 2022లో ఊహించని ధరను సొంతం చేసుకున్న విజయ్ శంకర్, ఇప్పుడు తమిళనాడు లీగ్‌లో సైతం భారీ ధర దక్కించుకోవడంతో.. క్రికెట్ ఫ్యాన్స్ 3డీ ప్లేయర్‌కు మంచి డిమాండ్ ఉంది, నీ లక్ సూపర్ శంకర్ అంటూ సోషల్ మీడియాలో వేదికగా పేర్కొన్నారు. కాగా.. విజయ్ శంకర్‌ను 2019 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన సమయంలో.. అంబటి రాయుడు చేసిన త్రీడీ గ్లాసెస్ ట్వీట్, ఎంపిక చేయడానికి సెలెక్టర్లు అతన్ని త్రీ డైమెన్షనల్ ప్లేయర్‌గా పేర్కొనడంతో విజయ్ శంకర్‌కు త్రీడీ ప్లేయర్ అనే బిరుదు వచ్చిన విషయం తెలిసిందే. మరి విజయ్ శంకర్‌కు తమిళనాడు ప్రీమియర్ లీగ్ వేలంలో దక్కిన ధరపై మీ అభ్రియాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Vijay Shankar sold to @TeamTiruppur for 10.25 L 💵
📺 Live Now @StarSportsTamil
#TNPLAuction #NammaOoruNammaGethu #TNPL2023 pic.twitter.com/vVPXx1w7KG
— TNPL (@TNPremierLeague) February 23, 2023